సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానం….హత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఔను వాళ్లిద్దరికీ పెళ్ళయ్యింది… కానీ ఆమె తన భర్తను విడిచి పెట్టింది. అతడు తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. వీళ్లిద్దరి మనసులు కలిశాయి. ఒక్కటయ్యారు. కానీ అతడిని అనుమానం అనే పెనుభూతం వెంటాడింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు.మహారాష్ట్ర, పూణే లోని , షిరూర్ గ్రామానికి చెందిన సారిక సుదాం గిర్మాకర్(30) దత్తాత్రేయ జేనుబావ్ గైక్వాడ్ (40) లకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ అప్పటికే వారి వారి జీవిత భాగస్వాములనుంచి వేరు పడ్డారు. వీరి మనసులు కలిశాయి. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. నాలుగేళ్శుగా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు.

ఇంతలో దత్తాత్రేయ కు సారిక మీద అనుమానం పెరగసాగింది. ఆమె తనను కాక వేరే వ్యక్తితో ఆమె లైంగిక సంబంధం పెట్టుకుందేమోనని అనుమానం వచ్చింది. ఈ విషయమై ఆమెతో చాలా సార్లు గొడవ పడ్డాడు. గొడవ పడుతున్నా కలిసే ఉన్నారు కానీ విడిపోలేదు.ఇటీవల మళ్లీ ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఆవేశంలో దత్తాత్రేయ సారికను హత్య చేశాడు. సమీపంలోని శిరూర్ పోలీసుస్టేషన్ కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు దత్తాత్రేయపై ఐపీసీ సెక్షన్ 302(హత్య నేరం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ. ప్రవీణ్ ఖానాపురే చెప్పారు.

Related Posts