చనిపోయిన అన్నయ్యను ఎక్కువగా ప్రేమిస్తోందని తల్లిని చంపేశాడు..వీడియో తీశాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పెద్ద కొడుకు చనిపోవడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. పదే పదే గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోయేది. చెట్టంత ఎదిగిన కొడుకు తీరని లోకాలకు వెళ్లిపోయిందని బాధ పడసాగింది. చిన్న కొడుకు ఆమెను ఓదార్చాల్సి పోయి..ఆమెపై కక్ష పెంచుకున్నాడు.తనకంటే..అన్నయ్యనే ప్రేమిస్తోందని కుమిలిపోయాడు. అంతే..ఏమాత్రం ఆలోచించని ఆ దుర్మార్గుడు..తల్లిని అంతమొందించాడు. అంతేగాదు..దీనిని సెల్ పోన్ లో వీడియో తీశాడు. మధ్యప్రదేశ్ జిల్లాలోని రైవా జిల్లాలో చోటు చేసుకుంది.

ఖాతిక గ్రామంలో సావిత్రి పాండే (44)ను ఎవరో చంపేశారని భర్త కృపాశంకర్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశారని, డెడ్ బాడీని అడవిలో పడేశారని ఫిర్యాదులో వెల్లడించారని రేవ పోలీస్ సూపరిటెండెంట్ రాకేశ్ సింగ్ తెలిపారు.సావిత్రిని చంపేస్తానని తన కొడుకు ధీరేంద్ర చాలాసార్లు బెదిరించేవాడని, అతనే చంపేసి ఉంటాడని ఆ తండ్రి అనుమానం వ్యక్తం చేశాడన్నారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గత సంవత్సరం సావిత్రి పెద్ద కొడుకును కోల్పోయిందని, దీంతో మానసికంగా..బాధ పడిందన్నారు. తరచూ అరుస్తూ ఏడ్చేదని తెలిపారు.

సావిత్రి చిన్న కుమారుడు ధీరేంద్ర జాబ్ లేక..ఉన్నాడని, అన్నయ్యను ఎక్కువగా ప్రేమిస్తోందని భావించి..తల్లిని ధ్వేషించడం ప్రారంభించాడన్నారు. భార్య, తల్లి తండ్రులతో చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడేవాడన్నారు. దీంతో పోలీసులు ధీరేంద్ర ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని, హత్యకు సంబంధించి వీడియో తీశానని వెల్లడించారని పోలీస్ సూపరిటెండెంట్ రాకేశ్ సింగ్ తెలిపారు.హత్యకు సంబంధించిన వీడియో తీశాడని, చంపొద్దని ఆ తల్లి వేడుకుంటున్నా..కనికరించకుండా..పదునైన ఆయుధంతో గొంతు కోశాడని తెలిపారు. ఆ సమయంలో నిందితుడు, తల్లి తప్ప ఎవరూ లేరన్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచిన తర్వాత..జైలుకు పంపారు.

Related Posts