Crime
పంజాగుట్టలో పగలే దారుణం : పోలీస్ స్టేషన్ సమీపంలో అలీ హత్య
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో దారుణం జరిగింది. వాకింగ్‌కి వచ్చిన వ్యక్తిపై కత్తులతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. దాడి అనంతరం దుండగులు పారిపోయారు.
Home » పంజాగుట్టలో పగలే దారుణం : పోలీస్ స్టేషన్ సమీపంలో అలీ హత్య
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో దారుణం జరిగింది. వాకింగ్‌కి వచ్చిన వ్యక్తిపై కత్తులతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. దాడి అనంతరం దుండగులు పారిపోయారు.
Published
1 year agoon
By
veegamteamహైదరాబాద్‌లోని పంజాగుట్టలో దారుణం జరిగింది. వాకింగ్‌కి వచ్చిన వ్యక్తిపై కత్తులతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. దాడి అనంతరం దుండగులు పారిపోయారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో దారుణం జరిగింది. వాకింగ్‌కి వచ్చిన వ్యక్తిపై కత్తులతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. దాడి అనంతరం దుండగులు పారిపోయారు. ఆ సమయంలో వాకర్స్ ఉన్నా చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరూ దుండగులను ఎదిరించే ప్రయత్నం చేయలేదు. చనిపోయిన వ్యక్తి రెండు రోజుల క్రితమే జైలు నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని రియాసత్ అలీగా పోలీసులు గుర్తించారు. రియాసత్ అలీ ఓ హత్య కేసులో నిందితుడు. ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాడు. ఇటీవలే జైలు నుంచి వచ్చాడు.
రియాసత్ అలీ వయసు 40 ఏళ్లు. ఆటోడ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం(అక్టోబర్ 20,2019) ఉదయం కొందరు దుండగులు అలీని నడిరోడ్డుపై వెంబడిస్తూ కత్తులతో కిరాతకంగా నరికేశారు. తీవ్ర రక్తస్రావంతో అతడు స్పాట్ లోనే చనిపోయాడు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం పంజాగుట్ట. పైగా పోలీస్ స్టేషన్‌కు కొద్ది దూరంలోనే ఈ ఘటన జరిగింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తి పరుగులు తీయడం వెనుకాల కొందరు కత్తులతో వెంబడించడం చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
జూన్ లో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ సమీపంలోనే అహ్మద్ అనే ఆటోడ్రైవర్ హత్య కేసులో అలీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి జైల్లో ఉన్న అలీ.. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో నాగార్జున సర్కిల్‌కు వచ్చిన అలీని దుండగులు కత్తులతో వెంబడించారు. డీవీఐఆర్టీ సిటీ సెంటర్ భవనం ఎదుట అతడిని ముట్టడించి కత్తులతో నరికి పారిపోయారు.
సమాచారం తెలుసుకున్న వెంటనే పంజాగుట్ట పోలీసులు స్పాట్ కి వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆహ్మద్ హత్యకు ప్రతీకారంగానే అలీని చంపి ఉంటారని, ఇది అహ్మద్ అనుచరుల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పడ్డారు.