మరదలితో అక్రమ సంబంధం, కాళ్లు చేతులు కట్టేసి నడిరోడ్డుపై దారుణ హత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అతను హైదరాబాదులో కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు.తన సామాజిక వర్గానికి  చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత భార్య చెల్లెలితో ప్రేమాయణం సాగించాడు. ఇది నచ్చని అత్తారింటివారు పధ్దతి మార్చుకోమని హెచ్చరించారు. అయినా ఖాద్రీ మరదలితో ప్రేమాయాణం సాగిస్తూనే ఉన్నాడు. అల్లడు ప్రవర్తనతో విసుగు చెందిన మాఁవ మాట్లాడటానికి రమ్మని పిలిచారు. ఆవేశంలో అల్లుడి కాళ్ళు చేతులు కట్టేసి గొంతుకోసి హత్య చేశారు.

సికింద్రాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన కార్ డ్రైవర్ సయ్యద్ మున్వర్ ఖాద్రీ (27) చంద్రాయణగుట్ట లోని హఫీజ్‌బాబా నగర్‌ కు చెందిన యువతిని(25) ప్రేమించాడు. ఐదేళ్ల క్రితం వీరిద్దరి వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల పాప, ఇరవై నాలుగు రోజులు బాబు ఉన్నాడు.పెళ్లైన తర్వాత నుంచి భాద్రీ కి భార్య సోదరి తో స్నేహం ఏర్పడింది. ఆస్నేహం ఆ స్నేహం క్రమేపీ వివాహేతర సంబంధంగా మారింది.   ఖాద్రి భార్యకు తెలియకుండా మరదలి దగ్గరికి వెళ్లి వస్తూ ఉండేవాడు.

తన భార్యకు తెలియకుండా మరదలుతోనూ ఎంజాయ్ చేయసాగాడు. ఇద్దరూ కల్సి గుట్టుగా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. కొన్నాళ్లకు ఇది భార్య ఇంట్లో వాళ్లకు తెలిసింది. అత్త, మామలు, బావ మరిది ఖాద్రీని హెచ్చరించారు. పధ్దతి మార్చుకోమని నచ్చచెప్పారు. అయినా ఖాద్రీ వారి మాటలు పెడచెవిన పెట్టాడు. మరదలితో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు.ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఖాద్రి, అతని మరదలు ఇద్దరూ కలిసి ఇంటి నుంచి పారిపోయారు. మళ్లీ   ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినా కానీ  వాళ్ళ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది. భార్య చెల్లెలితో అక్రమ సంబంధం కొనసాగించడం ఇష్టం లేని అతని మాఁవ,సెప్టెంబర్ 13వ తేదీ, ఆదివారం ఈ విషయమై మాట్లాడదాం రమ్మని చెప్పి ఖాద్రిని రమ్మన్నారు.

ప్రియురాలి మోజులో పడి పట్టించుకోని భర్తను నరికేసింది


ఆదివారం ఉదయం ఖాద్రీ, హఫీజ్‌బాబా నగర్‌ లో మాంసం దుకాణం నడిపే మాఁవ కొట్టువద్దకు వచ్చాడు. అక్కడ మాఁవ, బామ్మర్ది ఖాద్రీకి మళ్లీ నచ్చచెప్పారు.మరదలు తో అక్రమ సంబంధం మానుకోమని…. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చక్కగా చూసుకోమని చెప్పారు. వారి మాటలు ఖాద్రీ లెక్క చేయలేదు. ముగ్గురి మధ్య మాటామాటా పెరిగింది. ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మాఁవ, బామ్మర్ది ఖాద్రీ కాళ్లు చేతులు కట్టేసి, నడిరోడ్డు మీద తీసుకొచ్చారు. అక్కడ మాంసం కోసే కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.

READ  మహిళను హత్య చేసి.. ఒంటిపై ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు

సమాచారం తెలుసుకున్న సంతోష్ నగర్ ఏసీపీ శివ రామకృష్ణశర్మ, కంచన్ బాగ్ ఎస్సై వెంకటరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఖాద్రి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Related Posts