నేను అమిత్ షా పర్సనల్ సెక్రటరీని, వీడు కేంద్రమంత్రి గడ్కరీకే ఝలక్ ఇచ్చాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నేను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్సనల్ సెక్రటరీని అంటూ కేంద్రమంత్రి గడ్కరీ వ్యక్తిగత సిబ్బందికి కాల్ చేసి తన స్నేహితుడి బదిలీ ఆర్డర్ ను క్యాన్సిల్ చేయాలని కోరిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు అభిషేక్ ద్వివేది. నేను అమిత్ షా పర్సనల్ సెక్రటరీ అంటూ జూలై 3న కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యక్తిగత సిబ్బందికి ఫోన్ చేశాడు. ”నా స్నేహితుడు గ్వాలియర్ లో పరివాహన్ అయుక్త్ కార్యాలయంలో ఉదోగ్యం చేస్తున్నాడు. అతడిని మరో జిల్లాకు ట్రాన్సఫర్ చేశారు. ఆ ట్రాన్సఫర్ ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేయండి” అంటూ ఫోన్ లో చెప్పాడు.

అమిత్ షా పర్సనల్ సెక్రటరీ నుంచి కాల్ రావడంతో గడ్కరీ సిబ్బంది కంగుతిన్నారు. అమిత్ షా పర్సనల్ సెకట్రరీ ఏంటి, తమకు ఫోన్ చేయడం ఏంటి, బదిలీ ఆదేశాలు క్యాన్సిల్ చేయాలని కోరడం ఏంటి అని విస్తుపోయారు. వారికి ఎక్కడో అనుమానం వచ్చింది. వెంటనే విషయాన్ని నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే అమిత్ షా నిజమైన పర్సనల్ సెక్రటరీకి కూడా ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేశారు. అది అభిషేక్ ద్వివేది అనే వ్యక్తిదిగా గుర్తించారు. అతడిది మధ్యప్రదేశ్ లోని రేవా. కాగా ముంబై నుంచి కాల్ చేసినట్టు తెలుసుకున్నారు. అభిషేక్ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. పలు ప్రాంతాల్లో అతడి కోసం గాలించారు. పోలీసులు తన గురించి గాలిస్తున్నారు అనే విషయం తెలియడంతో అభిషేక్ ముంబై పారిపోయాడు. చివరికి ఇండోర్ లో పోలీసులకు చిక్కాడు. ఏ ఫోన్ నుంచి కాల్ చేశాడో ఆ ఫోన్ ని, సిమ్ ను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఎందుకిలా చేశావు అని పోలీసులు అభిషేక్ ను అడిగారు. తన చిన్ననాటి స్నేహితుడు వినయ్ సింగ్ కోసం ఇలా చేశానని అభిషేక్ తెలిపాడు. అతడిని ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు వచ్చాయని, వాటిని క్యాన్సిల్ చేయించాలని కోరినట్టు వివరించాడు. పోలీసుల విచారణలో అభిషేక్ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ బయటపడింది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే అనేక మోసాలు చేశాడు. పోలీసులు అభిషేక్ ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది.

READ  దారుణం, 1500మందికి విందు ఇచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్

Related Posts