Updated On - 11:18 am, Tue, 23 February 21
Man Puts Wife Hand in Boiling Oil To Test Her Purity : మహారాష్ట్రలోని ఉస్మాన్ బాద్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తన భార్యను శీలవతిగా నిరూపించుకోవాలంటూ అగ్ని పరీక్ష పెట్టాడో ఓ భర్త. సల సల కాగే నూనెలో చేతులు పెట్టించాడు.. కుండలో సెగలు కక్కుతున్న నూనెలో ఐదు రూపాయల కాయిన్ వేసి… దాన్ని తీయమన్నాడు. అలా తన స్వచ్ఛతను నిరూపించుకోవాల్సిందిగా భార్యను బలవంతం చేశాడు. మహిళ కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయింది. నాలుగు రోజుల వరకు ఇంటికి రాలేదు. ఆ తర్వాత కనిపించిన భార్యను ఇంటికి రావాలంటే తన స్వచ్ఛతను నిరూపించుకోవాలన్నాడు. అగ్ని పరీక్ష పెట్టాడు.. కాగే నూనెలో చేతులు బలవంతంగా పెట్టించాడు.. అదంతా వీడియో కూడా తీశాడా మూర్ఖుడు. అందిన నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 11న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దాంతో భార్య ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి
వెళ్లిపోయింది. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న భర్త ఆమె కోసం నాలుగు రోజులగా వెతికాడు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. ఒక రోజు ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. గొడవ పెట్టుకుని బయటకు వెళ్లిన రోజున ఉస్మాన్ బాద్లో పరాండలో ఖాచపూరి చౌక్ బస్టాప్ దగ్గర బస్ కోసం నిల్చున్నానని చెప్పింది. ఆ రోజున ఇద్దరు వ్యక్తులు బైక్ పై తనను బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలిపింది. నాలుగు రోజుల పాటు తమ దగ్గరే ఉంచుకున్నారని వాపోయింది. ఎలాగో అక్కడి నుంచి బయటపడి ఇంటికి తిరిగి వచ్చినట్టు తెలిపింది. దాంతో తన భార్య చెప్పేది నిజమా కాదా? తెలుసుకునేందుకు అగ్ని పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వారి కమ్యూనిటీ సంప్రదాయం ప్రకారం.. కాగే నూనెలో నుంచి వేసిన కాయిన్ తీయాల్సిందిగా చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nashik , It has been revealed that the same caste panchayat has ruled that a woman with suspicion should be boiled in boiling oil.
The husband took a video of the incident and made it viral. pic.twitter.com/eUz5bTmKbp— BHARAT GHANDAT (@BHARATGHANDAT2) February 20, 2021
ఈ వీడియోలో భర్త హిందీలో మాట్లాడుతున్నాడు.. తన భార్యను ఒక వ్యక్తితో పాటు పోలీసు తీసుకెళ్లారని, నాలుగు రోజుల తమ దగ్గరే పెట్టుకున్నారని అంటోంది. వాళ్లు తనను ఏం చేయలేదంటోంది. ఆమె చెప్పే మాటల్లో నిజం ఉందో తెలియదు. తాను నిజమే చెబుతుందో లేదో తెలుసుకోవాలి? అందుకే ఇలా చేస్తున్నానంటూ వీడియోలో అంటున్నాడు. వారి సంప్రదాయం ప్రకారం.. అబద్దం చెప్పిన వ్యక్తి.. మహిళ లేదా పురుషుడి చేతులు కాలిపోతాయి. అంతేకాదు.. ఆయిల్ నుంచి వస్తున్న మంటను కూడా మింగాల్సి ఉంటుంది. అగ్నిపరీక్ష పేరుతో మహిళలను వేధిస్తూ ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర లెగిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ నీలమ్ గోర్హే రాష్ట్ర హోంశాఖను డిమాండ్ చేశారు.