man shaves half his moustache after women entry into sabarimala

శబరిమల ఇష్యూపై అర మీసంతో నిరసన

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శబరిమల ఆలయంలోకి వెళ్లి బుధవారం ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేపసుకోవడంపై ఓ వైపు కేరళ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఫేక్ శబరిమళ ఫొటో షూట్ నిందితుడు రాజేష్(39) అరమీసం గీయించుకొని  ఇద్దరు మహిళల స్వామి దర్శనంపై నిరసన వ్యక్తం చేశాడు. ఆరెస్సెస్ ఫాలోవర్ గా ఉన్న రాజేష్ అరమీసంతో ఉన్న తన ఫొటోలను షేస్ బుక్ లో షేర్ చేశాడు. నిరసనలో భాగంగానే తాను అరమీసం గీయించుకొన్నానని, తమ ఆలయాలను లూటీ కాకుండా కాపాడుకొనేందుకు హిందువులు జాగ్రత్తలు తీసుకోవాలని తన ఫేస్ బుక్ ద్వారా రాజేష్ తెలిపాడు. శబరిమలలో అయ్యప్ప భక్తులను పోలీసులు వేధిస్తున్నారంటూ ఫేక్ ఫొటోలను షేర్ చేసిన ఘటనలో రాజేష్ ను కొధ్ది రోజుల క్రితం పోలీసులు అరెస్టు కూడా చేశారు.  

Related Posts