Home » రూ.200 అప్పు ఇవ్వలేదని కాల్చి చంపేశాడు
Published
2 months agoon
By
subhnMan Shot Dead: ఉత్తరప్రదేశ్ లోని సివిల్ లైన్స్ ఏరియాలో రూ.200 అప్పు ఇవ్వలేదని ఓ వ్యక్తిని కాల్చి చంపేశారు. ముగ్గురు పిల్లల తండ్రి అయిన హన్సర్ అహ్మద్ అనే వ్యక్తి టైర్ రిపైర్ షాప్ నిర్వహిస్తున్నాడు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న షంషద్ మార్కెట్ లో అతని షాపు దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు.
డ్రగ్స్ కు బానిస గా కనిపిస్తున్న అతని షాపు వద్దకు వచ్చి.. రూ.200కావాలని అడిగాడు. తన మోటార్ సైకిల్ అమ్మేయాలనుకుంటున్నా అన్నాడు. అతని రిక్వెస్ట్ కు షాపు యజమాని ఒప్పుకోకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు.
మళ్లీ అదే రోజు సాయంత్రం అహ్మద్ షాపుకు వచ్చి రూ.200అప్పు కావాలని అడిగాడు. దానికి బాధితుడు నో చెప్పడంతో ఆసిఫ్ జేబులో పెట్టుకున్న దేశీవాలీ తుపాకీతో కాల్చాడు. పక్కనే ఉన్నవారు రియాక్ట్ అయ్యేలోపే ఘటన జరిగిపోవడంతో అహ్మద్ కుప్పకూలాడు. అక్కడే పార్క్ చేసి ఉన్న టూ వీలర్ తీసుకుని పరారయ్యాడు నిందితుడు.