లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

డెడ్ బాడీతో మూడు రోజులు సహవాసం

Published

on

man spend time three days dead body : ఓ వ్యక్తి మహిళ మృతదేహంతో మూడు రోజులు సహవాసం చేశాడు. ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అకస్మాత్తుగా ఆమె చనిపోవడంతో ఎక్కడ తనపైకి వస్తుందోనన్న భయంతోనే..జాగ్రత్త పడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవుసలికుంటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన కృష్ణయ్య కూతురు కళమ్మ వివాహం అవుసలికుంటకు చెందిన శేఖర్ తో వివాహం జరిగింది. వీరికి వివాహమై 20 ఏళ్లు అయ్యింది.

కానీ..పది నెలలకే భర్త చనిపోవడంతో కళమ్మకు నాగనూలుకు చెందిన బాలపీరుతో రెండో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. కొన్నేళ్ల తర్వాత..రెండో భర్త…కూడా చనిపోవడంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. తండ్రి కృష్ణయ్య ఇటీవలే మందలించడంతో అవుసలికుంటలో ఒంటరిగా ఉంటున్న మొదటి భర్త తమ్ముడు లింగస్వామి ఇంటికి వచ్చింది. అప్పటికే అనారోగ్యానికి గురైన..పాలైన ఆమె గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో ఎక్కడ తనపైకి వస్తుందోనన్న భయంతో లింగస్వామి బయటకు పొక్కకుండా..జాగ్రత్త పడ్డాడు. శనివారం గుడిసె ముందు గుంతను తీసి శవాన్ని పూడ్చేందుకు గ్రామంలో మరో వ్యక్తి సాయం కోరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.