పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Man stabs woman with dagger after she rejects marriage proposal : ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన మైసూర్ లో వెలుగు చూసింది. కర్ణాటక, మైసూర్ లోని బెల్లికట్టే మిషన్ రోడ్ లో నివసించే క్యాబ్ డ్రైవర్ గగన్, లక్ష్మీపురం పోలీసు స్టేషన్ పరిధిలోని దేవాన్ష్ రోడ్డులో నివసించే మహిళను నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు.

ఇటీవల 15 రోజుల క్రితం వారిద్దరి మధ్య అభిప్రాయ భేధాలు వచ్చి విడిపోయారు. అతడు చేసిన పెళ్లి ప్రతిపాదనను కూడా ఆమె తిరస్కరించింది. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న మహిళ పెళ్లి చేసుకోటానికి అంగీకరించకపోయే సరికి గగన్ కోపంతో రగిలిపోయాడు.


ఆదివారం, నవంబర్ 15, ఉదయం గం.11-30ల సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను విచక్షణా రహితంగా పొడిచాడు. అనంతరం సమీపంలోని పోలీసుస్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు తీవ్ర గాయాలతో ఉన్న యువతిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


Related Tags :

Related Posts :