Home » మార్చురీలో నుంచి లేచి అరుపులు మొదలుపెట్టిన వ్యక్తి
Published
2 months agoon
By
subhnMortuary: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ వ్యక్తిని ప్రాణం ఉండగానే మార్చురీకి వెళ్లేలా చేసింది. 32ఏళ్ల వ్యక్తిని అంత్యక్రియల కోసం రెడీ చేస్తుండగా స్పృహలోకి వచ్చి లేచాడు. అంతేకాకుండా అతని కాలు పైకెత్తి మార్చురీకి వెళ్లబోతూ కేకలు మొదలుపెట్టాడు. రిపోర్టుల ప్రకారం.. కెరిచోలో ఉన్న కప్లాటెట్ హాస్పిటల్ లో కడుపునొప్పితో జాయిన్ అయ్యాడు. రోగి సోదరుడికి నర్సు తన అన్న చనిపోయాడని చెప్పింది.
ఓ డ్యాక్యుమెంట్ చేతికి ఇచ్చిన నర్సు.. మార్చురీకి తీసుకెళ్లమని సూచించింది. ఈ క్రమంలోనే అతణ్ని మార్గ్యూకి షిప్ట్ చేశాం. అక్కడ అతను ప్రాణాలతో లేడని తెలిసిన వెంటనే అంత్యక్రియల కోసం మార్చురీకి తీసుకెళ్లబోయాం. స్టాఫ్ ఒంటి నుంచి రక్తాన్ని తీసేసే ప్రక్రియలో ఉన్నప్పుడే అతను ప్రాణాలతోనే ఉన్నాడని తెలిసింది.
స్పృహలోకి వచ్చిన వ్యక్తి బాధతో కేకలు మొదలుపెట్టాడు. అటెండెంట్లు చనిపోయిన వ్యక్తికి ప్రాణం వచ్చిందనుకుని భయంతో పరుగులు మొదలుపెట్టారు. వెంటనే అతణ్ని క్యాజువల్ డిపార్ట్మెంట్కు తరలించారు.
‘మార్చురీలో ఉన్న వ్యక్తి మమ్మల్ని పిలవడం మొదలుపెట్టాడు. కాసేపు వరకూ మేం షాక్ లో ఉండిపోయాం. మాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత గానీ అర్థం కాలేదు అతను ప్రాణాలతోనే ఉన్నాడని’ కైజెన్ సోదరుడు అంటున్నారు. డాక్టర్లు ప్రాణాలతో లేడని చెప్పిన వ్యక్తి నార్మల్ గా తిరిగి రావడాన్ని నమ్మలేకపోయానని అంటున్నాడు అతని సోదరుడు.
జరిగింది నమ్మలేకపోతున్నాను. చనిపోయానని ఎలా చెప్పగలిగారు. నేను ఎప్పుడు స్పృహ కోల్పోయాను. మళ్లీ ఎప్పుడు తిరిగొచ్చానో గుర్తు లేదు. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను’ అని అన్నాడు. హాస్పిటల్ నిర్లక్ష్యం చూపించిందని ఫ్యామిలీ అతనిని నిందించడం మొదలుపెట్టింది.