Home » కూరగాయల కోసం..వెళ్లి వరదలో కొట్టుకపోయాడు, అధికారులు నిర్లక్ష్యమంటున్న కుటుంబసభ్యులు
Published
3 months agoon
By
madhuMan washed away in Krishna Lanka : కృష్ణా, గుంటూరు లంక గ్రామాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి., కృష్ణా నది ఉగ్రరూపంతో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నిత్యావసర సరుకులు లేక అల్లాడిపోతున్నారు. ప్రమాదకరపరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా..ఆవురిపాలెంకు చెందిన శంకర్రావు కూరగాయల కోసం కొల్లూరుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా..వరద ప్రవాహంలో కొట్టుకపోయాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చూస్తుండగానే కొట్టుకపోయాడు. 2020, అక్టోబర్ 18వ తేదీ ఆదివారం ఉదయం స్థానికులు శంకర్రావు మృతదేహాన్ని గుర్తించారు.
అధికారులు స్పందించి ఉంటే..తన తండ్రి బతికేవాడని శంకర్రావు కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం మృతదేహాన్ని వెలికి తీయడంలో సహాయం చేయడం లేదని, రూ. 10 వేలు ఖర్చు పెట్టి…ప్రైవేటు గజ ఈతగాళ్ల సహాయం తీసుకుని మృతదేహం కోసం గాలింపు చేపట్టామంటున్నారు. గ్రామస్తులు కూడా అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
మరోవైపు… కృష్ణా నదిలోకి వరద ఉగ్రరూపం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి శనివారం సాయంత్రం ఆరు గంటలకు 5,42,339 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు వదలగా మిగులుగా ఉన్న 5,38,867 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.