చరణ్‌తో దివాళీ.. మంచు లక్ష్మీ భాయ్ దూజ్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Ram Charan – Manchu Manoj: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాకింగ్ స్టార్ మంచు మనోజ్, లక్ష్మీ మంచు కలిసి ఈ దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. స్వీట్ బ్రదర్ చరణ్, లవ్లీ అక్క లక్ష్మీలతో దివాళీ పండుగ జరపుకోవడం ఆనందంగా ఉంది అంటూ ఇందుకు సంబంధించిన ఫొటోను మనోజ్ తాజాగా షేర్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Manoj Kumar Manchu (@manojkmanchu)

భాయ్ దూజ్ శుభాకాంక్షలు
దీపావళి అనంతరం వచ్చే పాడ్యమి రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుందనే విషయం తెలిసిందే. కార్తీకమాసం ప్రారంభమవ్వడమే కాకుండా.. ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే.. సోదరులకు సోదరీమణులు స్వయంగా తయారు చేసిన భోజనాన్ని తినిపించాలి. దీనినే తెలుగులో భగినీహస్త భోజనం అంటారు.


భగినీ అంటే అక్కా లేదా చెల్లి అని అర్థం. దీనికి సంబంధించి పురాణాల్లో ఓ కథ కూడా ఉందనేది నానుడి. ఈ భగినీహస్త భోజనం వేడుకను మంచు లక్ష్మీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోలతో ఆమె తన ఇన్‌స్టాగ్రమ్ ద్వారా ఓ వీడియోని షేర్ చేసింది.Lakshmi Manchuఈ ఫొటోలు చూస్తుంటే తన ఇద్దరు సోదరులతో మంచు లక్ష్మీ చాలా సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. చిన్న పిల్లలా పెద్ద తమ్ముడు విష్ణుపైకి ఎక్కేసింది. ఇక ఈ వీడియో షేర్ చేసిన మంచు లక్ష్మీ.. భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలుపుతూ.. మంచు విష్ణు, మంచు మనోజ్‌లే తనకు బలమని చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

చలికి వణుకుతున్న RRR టీమ్

 

View this post on Instagram

 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

Related Tags :

Related Posts :