లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

కరోనా బోయ్ గేమ్ : లాక్‌డౌన్‌లో చిక్కుకుకున్న పిల్లాడ్ని ఊరు చేరిస్తే మీరే విన్నర్

Published

on

కరోనా వైరస్ తీసుకొచ్చిన లాక్ డౌన్ ఎంత మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. ఈ లాక్ డౌన్ తో ఎంతోమంది తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఈ కష్టాల్లోనే ఎంతోమంది కష్టంతో పాటు ప్రతిభ కూడా వెలుగులోకి వచ్చాయి. వందల కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి కన్నవాళ్లను తీసుకెళ్లిన బిడ్డలు..బిడ్డల కోసం కన్నవారు పడిన కష్టం..తపన ఎంతోమందిని కదిలించాయి.ఇదిలా ఉంటే లాక్ డౌన్ కష్టాల్లో చిక్కుకుని..బస్సులు..రైళ్ల ప్రయాణాలు లేక తమ సొంత గ్రామానికి చేరటానికి ఎటువంటి పాట్లు పడాలో తెలిసింది. అటువంటి లాక్ డౌన్ మణిపూర్ చెందిన ఓ కుర్రాడి ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చింది. ‘కరోనా బోయ్ ’పేరుతో ఏకంగా ఓ గేమ్ ను రూపొందించాడు మణిపూర్ కు చెందిన 9వ తరగతి విద్యార్ధి ‘బల్దీప్ నింగ్‌టోజామ్’

కరోనా పేషెంట్ కేఫ్‌కు వెళ్లి 27 మందికి అంటించింది


‘లిటిల్ కృష్ణ’ తరహాలో ఈ బుల్లోణ్ని రోడ్డంట పరిగెత్తిస్తూ బోల్దంత టైమ్ చేయొచ్చు అంటున్నాడు బల్దీప్ నింగ్‌టోజామ్. లాక్‌డౌన్‌లో చిక్కకుకున్న ఆ పిల్లాడ్ని వాడి సొంత ఊరికి చేరిస్తే గేమ్ పూర్తి చేసినట్లే.ఇంఫాల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి బల్దీప్ నింగ్‌టోజామ్ ఈ మొబైల్ ఫోన్‌ గేమ్‌ను సృష్టించాడు. దీని పేరు COROBOI అని పేరు పెట్టాడు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ గేమ్ అందుబాటులో ఉంది. కరోనానుంచి తప్పించుకోవడం, బలమైన ఆహారం తీసుకోవడం, లాక్ డౌన్ సమయంలో పోలీసులకు దొరక్కకుండా తప్పించుకోవడం.. ఇదీ గేమ్ సారాంశం. రోడ్డులో పరిగెడుతూ కరోన్ బాల్స్ తప్పించుకుని దారిలో దొరికే పళ్లు అందుకుంటూ వెళ్తే పాయింట్లు వస్తాయి. పోలీసోళ్లకు చిక్కితే పాయింట్లు పోతాయి. తాను భవిష్యత్తులో మంచి పనులు చేసే ఎథికల్ హ్యాకర్ కావాలనుకుంటున్నానని బల్దీప్ చెబుతున్నాడు.

పాక్, చైనాతో కలిసి రష్యా లో భారత దళాల మిలిటరీ ఎక్సర్ సైజ్


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..ఇతర టెక్నాలజీల గురించి మరింత తెలుసుకోవాలని ఉందనీ… COVID లో ఆటను డెవలప్ చేయమని మా మామయ్య ఇచ్చిన సలహాతో ఈ గేమ్ ను తయారుచేశానని చెప్పాడు బల్దీప్ నింగ్‌టోజామ్.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *