Home » ఎవరు చంపారు? ఎందుకు చంపారు? సాఫ్ట్వేర్ ఇంజినీర్ పవన్ సజీవదహనం కేసులో ఎన్నో అనుమానాలు
Published
2 months agoon
By
naveenHyderabad Techie Pawan Burnt Alive case: జగిత్యాల జిల్లా టెకీ సజీవ దహనం కేసులో.. ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడనమ్మకాలతో పవన్‌ను దారుణంగా హత్య చేశారని భావించినా.. పాతకక్షలే పవన్ హత్యకు కారణమని తెలుస్తోంది. కొత్త ట్విస్టుల మధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగి సజీవదహనం కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. పవన్ దారుణ హత్యలో భార్య కృష్ణవేని పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. కృష్ణవేణి కుటుంబసభ్యులే తమ బిడ్డను చంపేశారని పవన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఏడాదిగా భార్య, భర్తల మధ్య గొడవలు:
ఏడాది నుంచి పవన్ – కృష్ణవేణి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. రాజీ కుదుర్చుదామని ప్రయత్నించినా అవేమీ ఫలించలేదని పవన్ తల్లిదండ్రులు చెబుతున్నారు. పవన్, కృష్ణవేణి సోదరుల మధ్య కూడా కొంతకాలంగా ఫోన్లోనే ఘర్షణలు జరుగుతున్నాయని వారు వాపోయారు. రెండు రోజుల క్రితమే భార్య కృష్ణవేణిని పవన్ మాల్యల పంపాడని.. నిన్న(నవంబర్ 23,2020) సాయంత్రమే పవన్ మాల్యలకు వచ్చినట్లు అతని తల్లిదండ్రులు చెబుతున్నారు.
పక్కా ప్లాన్ ప్రకారమే పవన్ దారుణ హత్య:
పక్కా ప్లాన్ ప్రకారమే తమ బిడ్డను దారుణంగా హత్య చేశారని.. ఇందులో కృష్ణవేణి ఆమె అన్నలు, అన్న భార్య సుమలత, కృష్ణవేణి తల్లి పాత్ర కూడా ఉందని పవన్ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇక కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితులు సంజయ్, సుమలత, పవన్ భార్య కృష్ణవేణిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగి పవన్ హత్యకు కారణాలేంటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. పక్కా స్కెచ్‌తోనే పవన్‌ను హత్య చేశారని తెలుస్తుండగా.. మర్డర్ ప్లాన్‌లో పవన్ భార్య కృష్ణవేణి పాత్ర ఎంత ఉందనే దానిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్లాన్ ప్రకారమే పవన్‌ను మాల్యలకు రప్పించారా అన్నది కూడా ఓ ప్రశ్నగా మిగిలిపోతోంది. పవన్-కృష్ణవేణి దంపతుల మధ్య విబేధాలున్నాయని.. కృష్ణవేణి సోదరులతో కూడా గొడవలు జరుగుతున్నాయిని పవన్ పేరెంట్స్ చెబుతున్న దాంట్లో నిజమెంతో తేలాల్సి ఉంది.
హైదరాబాద్ నుంచి మాల్యలలోని.. కృష్ణవేణి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పవన్ – కృష్ణవేణి ఎందుకు కలిసి రాలేదనేది కూడా మిస్టరీగానే మిగిలింది. ఇక కుటుంబ కలహాలతోనే పవన్ ని టార్గెట్ చేసి చంపేసినట్లు తెలుస్తోంది. పవన్ హత్యలో ఇంకా ఎంత మంది పాత్ర ఉందనేది కూడా ప్రశ్నగా మారింది.
ఒక మర్డర్.. పది ప్రశ్నలు
1. సాఫ్ట్వేర్ ఉద్యోగి పవన్ హత్యకు కారణాలేంటి..?
2. పక్కా స్కెచ్‌తో పవన్‌ను సజీవ దహనం చేశారా..?
3. పవన్ మర్డర్‌లో భార్య కృష్ణవేణి పాత్ర ఎంత..?
4. ప్లాన్ ప్రకారమే పవన్‌ను మాల్యలకు రప్పించారా..?
5. పవన్-కృష్ణవేణి దంపతుల మధ్య విబేధాలున్నాయా..?
6. కృష్ణవేణి సోదరులతో పవన్ గొడవలేంటి..?
7. పవన్ పేరెంట్స్ ఆరోపణల్లో నిజమెంత..?
8. కుటుంబ కలహాలతోనే పవన్‌ను టార్గెట్ చేశారా?
9. పవన్ హత్యలో ఇంకా ఎంత మంది పాత్ర ఉంది..?
10. పరామర్శకు పవన్-కృష్ణవేణి ఎందుకు కలిసి రాలేదు..?