లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

పెదనాన్న కూతురితో పెళ్లి కోసం హైకోర్టుకు వెళ్లాడు!!

Published

on

Marriage: మేనరిక పెళ్లి కాదు ఇది అంతకుమించి.. పైగా పంజాబ్, హర్యానా హైకోర్టులను ఆశ్రయించి న్యాయం కావాలని అడిగాడో వ్యక్తి. వయస్సులో చిన్నది అనే ఒకటే చూపిస్తూ పెళ్లి కోసం హైకోర్టు నుంచి అప్రూవల్ కావాలని వేసిన పిటిషన్ కు హైకోర్టు ఇలా స్పందించింది.

‘ప్రస్తుత పిటిషన్ లో ఆమె వయస్సు ఒకవేళ 18ఏళ్లు దాటినా వివాహం చేసుకోవడం చట్టబద్ధం కాదు’ అని ఓ పిటిషన్ లో వాదన విన్న జడ్జి గురువారం వెల్లడించారు.21ఏళ్ల వ్యక్తి పంజాబ్ హైకోర్టుకు వెళ్లి సెక్షన్స్ 363(కిడ్నాపింగ్), 366Aకింద నమోదైన కేసులపై యాంటిసిపేటరీ బెయిల్ కావాలని మొరపెట్టుకున్నాడు. బెయిల్ ప్లీని తిరస్కరించింది స్టేట్ కౌన్సిల్. అమ్మాయి మైనర్ కావడంతో, ఆమె తల్లిదండ్రులు కేస్ ఫైల్ చేశారు. ఇందులో కీలకమైన విషయం ఇరువురు తండ్రులు అన్నదమ్ములే.

బాలికతో కలిసి ఆ వ్యక్తి వేసిన పిటిషన్ పై స్పందించిన జస్టిస్ అరవింద్ సింగ్ సంగ్వాన్ క్రిమినల్ పిటిషన్ కూడా వేశాడు. 17ఏళ్ల యువతితో లివిన్ రిలేషన్‍‌షిప్‌లో ఉంటున్నామని తమకు ఇరువురి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని అందులో రాశాడు.

బాలిక ఆగష్టు 2003లో పుడితే 2020 సెప్టెంబర్ 3 పిటిషన్ వేసిన నాటికి ఆమెకు 17సంవత్సరాల 14రోజుల వయస్సు మాత్రమే ఉంటుందని మైనర్ కాబట్టే పేరెంట్స్ పెట్టిన కేసు మాత్రమే చెల్లుతుందని కోర్టు చెప్పింది. బాలిక వేసిన పిటిషన్లో పేరెంట్స్ కొడుకులను మాత్రమే పట్టించుకుంటున్నారని తనను విస్మరిస్తున్నారని తెలిపింది.

చట్టాన్ని వ్యతిరేకిస్తూ వాళ్లు వేసిన పిటిషన్ చెల్లదని కొట్టిపారేసింది. యాంటిసిపేటరీ బెయిల్‌ను వ్యతిరేకించిన స్టేట్ కౌన్సిల్.. బాలిక వయస్సు 17 సంవత్సరాలు మైనర్ కావడంతో పేరెంట్స్ కేస్ ఫైల్ చేశారు. అదీకాకుండా వారిద్దరూ అన్నదమ్ముల పిల్లలు. ఆమెకు 18ఏళ్ల నిండినప్పటికీ వారిద్దరి వివాహం చట్టబద్ధం కాదని తేల్చి చెప్పేశారు.

పిటిషనర్ కు కేస్ వాదనను వచ్చే ఏడాది జనవరి నాటికి వాయిదా వేసినట్లు చెప్పారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *