Married Woman and her paramour arrested for murdering husband in Tamilnadu

ప్రియుడితో భార్య రాసలీలలు – వద్దన్నందుకు భర్త హత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తాళి కట్టిన భర్త ఇంట్లో ఉండగా పరాయి మగాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందో మహిళ. వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విఛ్ఛిన్నమవుతున్నాయని తెలిసినా తన కంటే  వయస్సులో చిన్నావాడైన వ్యక్తితో  రాసలీలలాడింది. విషయం తెలుసుకుని ఆ సంబంధాన్ని మానుకోమని హెచ్చరించినందుకు… ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది ఆ ఇల్లాలు. చివరికి చేసిన నేరానికి జైలు జీవితం గడుపుతోంది.

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా నాట్రాంపల్లి సమీపంలోని పోతకుట్ట ప్రాంతం, జయంతి పురం వద్ద టైలర్ గోవింద్ రాజ్ (58) జూన్ 4వ తేదీన తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి ఉండగా పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం సేలం ప్రభుత్వం ఆస్పత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 15న న కన్ను మూశాడు. అతని శరీరం నుంచి  వైద్యులు 14  రబ్బరు బుల్లెట్లు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  విచారణ చేపట్టగా గోవింద రాజ్ భార్య కాంచన(38) తన ప్రియుడి సహకారంతో  గోవింద్ రాజ్ ను హత్యచేయించినట్లు తేలింది.

కృష్ణ గిరి జిల్లాలో నివసించే  టైలర్ గోవింద్ రాజ్(58) భార్య కాంచన(38)దంపతులకు నలుగురు ఆడపిల్లలు. పెద్ద పిల్లకు పెళ్లి చేసిన తర్వాత, రెండేళ్ల క్రితం ఆ దంపతులు ఇల్లు కట్టుకున్నారు. ఇంటి పని కోసం వచ్చిన మేస్త్రీ కుప్పు స్వామి(30)తో కాంచన వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంటి నిర్మాణం పూర్తయినా కాంచన, కుప్పుస్వామిని తరచుగా కలుస్తూనే ఉంది. తనకంటే వయస్సులో 8 ఏళ్లు చిన్నవాడైన కుప్పుస్వామి సహచర్యంలో కాంచన స్వర్గ సుఖాలను అనుభవించసాగింది.   

భర్తకు తెలియకుండా కాంచన కుప్పుస్వామిలు శృంగారాన్ని ఎంజాయ్ చేయసాగారు. కొన్నాళ్లకు ఈ విషయం గోవిందరా జ్ పసిగట్టాడు.  భార్య కాంచనను హెచ్చరించాడు. వివాహేతర సంబంధం మానుకోవాలని సూచించాడు. భర్త మాటలు పెడ చెవిన పెట్టిన కాంచన… విషయం తెలిసిపోయింది కాబట్టి మరింత స్వేఛ్చగా కుప్పుస్వామితో తిరగటం మొదలెట్టింది. భార్య ప్రవర్తన సహించలేని గొవిందరాజ్ కొన్ని సార్లు భార్యపై చేయి చేసుకున్నాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పురాలేదు. కుప్పుస్వామితో శృంగార లీలలు ఎక్కువయ్యాయి. 

తన కంటే 8 ఏళ్లు పెద్దదైన ఆంటీతో కుప్పుస్వామి లైంగికసుఖాలు అనుభవిస్తున్నాడు. భర్త తనపై చేయిచేసుకోవటం భరించలేని కాంచన భర్తను తుదముట్టించాలని నిర్ణయించుకుంది. ప్రియుడు కుప్పుస్వామికి విషయం చెప్పింది. కాంచన, కుప్పుస్వామి, అతని మిత్రుడైన వీరాసామి ముగ్గురు కలిసి గోవింద రాజ్ ను హతమార్చాలని ప్లాన్ చేశారు. కుప్పుసామి,వీరాసామి కలిసి కడంబూర్ కు వెళ్లి నడికరువర్ కు చెందిన ముత్తయ్య అనే వ్యక్తి వద్ద లక్ష రూపాయలకు పొలాల్లో అడవి పందులను, పక్షులను వేటాడే నాటు తుపాకి కొనుగోలు చేశారు.
 
జూన్ 4వ తేదీ రాత్రి సుమారు 9-30గంటల సమయంలో గోవిందరాజ్ మద్యం సేవించి తన ద్విచక్ర వాహానం పై నాట్రంపల్లి నుంచి ఇంటికి వెళ్తుండగా కుప్పుసామి అతని స్నేహితుడు వీరాసామి గోవింద్ రాజ్ ను ఫాలో అయ్యారు. జయంతి పురం వద్దకు రాగానే అతనిపై నాటు తుపాకితో కాల్పులు జరిపారు. అతని శరీరంలోకి 14 పిల్లెట్లు దిగబడ్డాయి. వాటి ధాటికి గోవింద్ రాజ్ తన ద్విచక్రవాహనం పైనుంచి కింద పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 

తీవ్ర గాయాలతో ఉన్న గోవిందరాజ్ ను స్ధానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు గోవిందరాజ్ ను తిరుపత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సేలం తరలించగా… చికిత్స పొందుతూ జూన్ 15న  కన్నుమూశాడు. గోవింద్ రాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు కాంచన నాటకం ఆడింది. గోవింద రాజ్ శరీరం నుంచి 14 పిల్లెట్లను వైద్యలు వెలికి తీశారు. 

కేసు  విచారణలో భాగంగా  పోలీసులు కాంచన సెల్ ఫోన్ కాల్ లిస్టు చెక్ చేశారు. ఆమె అనేక సార్లు కుప్పుసామితో మాట్లాడినట్లు తేలింది. విచారించగా ఆమె తనకు, కుప్పుసామికి ఉన్న లైంగిక సంబంధాన్ని బయటపెట్టింది. తానే కుప్పుసామి సహకారంతో  హత్య చేయించినట్లు ఒప్పుకుంది.  పోలీసులు గురువారం జూన్ 15న ఆమెను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి కాంచనతో సహా మరో నలుగురు నిందితులను రిమాండ్ కు తరలించారు. తప్పించుకున్న మరో నిందితుడు వీరాసామి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Related Tags :

Related Posts :