సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన ఫొటోలు…వివాహిత ఆత్మహత్యాయత్నం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నిర్మల్‌ జిల్లాలో దారుణం జరిగింది. తనకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ముధోల్‌లో శనివారం చోటుచేసుకుంది.

పురుషోత్తం అనే వ్యక్తి ఓ వివాహితకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. మనస్తాపం చెందిన ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో ఆమెను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. భర్త ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related Tags :

Related Posts :