లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

ప్రాణం మీదకు తెచ్చిన అక్రమ సంబంధం, ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. ప్రియురాలే ప్రియుడిపై హ‌త్యాయ‌త్నం చేసింది. అత‌డిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కృష్ణా జిల్లా

Published

on

married woman set fire to lover

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. ప్రియురాలే ప్రియుడిపై హ‌త్యాయ‌త్నం చేసింది. అత‌డిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. ప్రియురాలే ప్రియుడిపై హ‌త్యాయ‌త్నం చేసింది. అత‌డిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో ఈ ఘటన జరిగింది. మండలంలోని ముత్యాలంపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ కందులపాడుకు చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇద్దరికీ అప్పటికే వివాహాలు అయ్యాయి. ప్రియుడి మోజులో భర్తతో విడిపోయిన ఆ మహిళ కందులపాడు అడ్డరోడ్డు దగ్గర బడ్డీ కొట్టు పెట్టుకుని జీవిస్తోంది. దీంతో కోటేశ్వరరావు తరుచూ అక్కడికి వస్తూ ప్రియురాలితో రాసలీలలు సాగిస్తూ ఉండేవాడు.

ఏం జరిగిందో కానీ, కోటేశ్వరరావు కొద్దిరోజులుగా ప్రియురాలి దగ్గరకు వెళ్లడం మానేశాడు. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఇతరులతో కబురు పెట్టినా అతడు స్పందించడం లేదు. చివరకు ఆదివారం తన స్నేహితుడితో కలిసి మహిళ ఇంటికి వెళ్లాడు కోటేశ్వరరావు. తనను ఎందుకు దూరం పెట్టావంటూ ఆ మహిళ కోటేశ్వరరావుతో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది.

కోపంతో ఊగిపోయిన ఆ మహిళ కోటేశ్వరావుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కళ్ల ముందే జరిగిన ఘోరంతో కోటేశ్వరరావు స్నేహితుడు షాక్ తిన్నాడు. ఆ తర్వాత స్థానికుల సాయంతో మంటలను ఆర్పాడు. జి.కొండూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి కోటేశ్వరరావుని తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 70శాతం కాలిన గాయాల‌తో కోటేశ్వరరావు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. కోటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గొడవకు అసలు కారణం ఏంటో తెలుసుకునే పనిలో ఉన్నారు.(తన కొడుకు కంటే 6 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ చేస్తున్న ఆంటీ)

అక్రమ సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదమే అని పోలీసులు అంటున్నారు.. ఏ మాత్రం బెడిసి కొట్టినా, తేడా వచ్చినా ప్రాణం పోవడం ఖాయం అని హెచ్చరించారు. కోటేశ్వరరావుకి ఈ దుస్థితి పట్టడానికి అదే కారణం అన్నారు పోలీసులు. అలాంటి సంబంధాలకు దూరంగా ఉండటమే అందరికీ మంచిదని హితవు పలికారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *