లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పెళ్లికి వ్యక్తిని ఎంచుకోవడమనేది కూడా ఓ ప్రాథమిక హక్కే

Published

on

marrying person: లవ్ జిహాద్‌పై దేశమంతా చర్చలు జరుగుతున్న సమయంలో పెళ్లి కోసం మతం మారడమనే అంశంపై కర్ణాటక హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. పెళ్లి చేసుకోవడానికి ఓ వ్యక్తిని ఎంచుకోవడమనేది ప్రాథమిక హక్కుల్లో ఒకటి. రాజ్యంగపరంగా హైకోర్టు హక్కు ఉందని చెప్తుంది.

‘భారత రాజ్యాంగపరంగా ఎవరైనా అబ్బాయి/అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే ప్రాథమిక హక్కుల్లో ఒకటి. అది ఏ మతం అయినా, ఏ కులం అయినా వాటితో సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు సంబంధం కలుపుకోవచ్చు’ అని కోర్టు వెల్లడించింది.వాజిద్ ఖాన్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రమ్య అనే యువతిని విడిపించాలని పిటిషన్ వేశారు. కోర్టు ముందు లైవ్‌లో ఎన్జీఓల సమక్షంలో హాజరైంది రమ్యా. అంతకంటే ముందు పేరెంట్స్ తన హక్కుకు వ్యతిరేకంగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు.

ఇదే రకమైన సెంటిమెంట్లను చూపించాయి అలహాబాద్, ఢిల్లీ హైకోర్టులు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెళ్లికి మతం మారడమనే అంశాన్ని చట్టపరంగా నేరంగా భావిస్తూ జైలు శిక్ష అమల్లోకి తీసుకొచ్చాయి. ముస్లిం యువకులు, హిందూ యువతుల పెళ్లిళ్లకు లవ్ జిహాద్ అంశాన్ని అంటగట్టడంపై వ్యతిరేక వాదన కర్ణాటక గవర్నమెంట్ ముందుకొచ్చింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *