కారు కొనక్కర్లేదు.. చందా చెల్లించి వాడేసుకోండి!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశీయ కార్ల తయారీలో టాప్ సెల్లర్ మారుతి సుజుకీ కారు సబ్ స్ర్కిప్షన్ ప్రొగ్రామ్ ప్రారంభించింది. ప్రత్యేకించి హైదరాబాద్, పుణెలోని వినియోగదారుల కోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఈ కొత్త కార్ల చందా కార్యక్రమం అందుబాటులో ఉంటుంది. మారుతి సుజుకి సబ్‌స్ర్కైబ్ అని పేరు పెట్టింది.ఈ ప్రాజెక్టు కోసం Myles Automotive Technologies అనే సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రొగ్రామ్ కింద అన్ని మారుతీ కార్లను నెలసరి చందా చెల్లిస్తే చాలు.. కొత్త కార్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే వాడుకోవచ్చు.
Maruti Suzuki launches car subscription program in Pune, Hyderabadమారుతీ స్విఫ్ట్ LXI కారును పుణె‌లో రూ.17,600, హైదరాబాద్‌లో రూ.18,350 కనీస నెలవారీ చందాతో తీసుకోవచ్ఛు. రోడ్డు పన్ను- రిజిస్ట్రేషన్, కారు నిర్వహణ, బీమా, 24/7 రోడ్ సైడ్ సపోర్ట్ అన్ని ఉంటాయి. ఎలాంటి డౌన్ పేమెంట్ కూడా అవసరం లేదు. 12 నెలల నుంచి 48 నెలలు నెలవారీ చందా చెల్లించాల్సి ఉంటుంది.. ఒకవేళ అదే కారును కావాలనుకుంటే కొనుగోలు చేసుకోవచ్చు.మారుతి సుజుకీలోని పలు మోడల్ కార్లలో Swift, Dzire, Vitara Brezza, Ertiga, Baleno, Ciaz, XL6 NEXA తదితర అన్ని మారుతీ కార్లకు ఈ సదుపాయం లభిస్తోంది. ఇలాంటి పథకాన్ని ఇప్పటికే గురుగావ్, బెంగుళూరు నగరాల్లో మారుతీ సుజుకీ అమలు చేస్తోంది.

Maruti Suzuki launches car subscription program in Pune, Hyderabad

అన్ని వైరస్‌లకు ఒకటే కరోనా వ్యాక్సిన్, కేంబ్రిడ్జ్ ముందడుగు


ఓరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్ (ఓరిక్స్- జపాన్ అనుబంధ సంస్థ) భాగస్వామ్యంతో ఈ ఏడాది జులైలో ఈ రెండు నగరాల్లో ఈ స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చింది. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా 12, 18, 24, 30, 36, 42, 48 నెలల పాటు ఈ కార్లలో దేనినైనా సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు.

Related Posts