లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

స్కూల్స్, కాలేజీలు రీ ఓపెన్ – మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి

Published

on

ఉత్తరప్రదేశ్ లోని కంటైన్మెంట్ జోన్ స్కూల్స్ కూడా రీ ఓపెన్ అవనున్నాయి. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకూ.. సోమవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కరోనావ్యాప్తిని అడ్డుకోవాలని మార్చి నెలలో క్లాసులు ఆపేశారు. హెల్త్, శానిటైజేషన్, తప్పనిసరి ప్రొటోకాల్స్.. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లు ఫాలో అవుతూ.. రీ ఓపెన్ కు రెడీ అవుతున్నారు.

ప్రతి షిఫ్ట్‌లో శానిటైజేషన్ రూల్స్ పాటించాలని ప్రభుత్వం కండిషన్ విధించింది. తొలి దశలో భాగంగా క్లాస్ 9నుంచి 12వరకూ ఓపెన్ చేశారు. కాసేపు వరకూ అయినా స్కూల్స్ రన్ చేయాలని.. అదే సమయంలో స్టూడెంట్ సేఫ్టీ గురించి కూడా ఆలోచించాలని’ డిప్యూటీ చీఫ్ మినిష్టర్ దినేశ్ శర్మ అక్టోబర్ 10న అన్నారు.స్కూల్స్, స్టూడెంట్లు, టీచర్లకు కొత్త గైడ్‌లెన్స్ ఇలా ఉన్నాయి.
1. తప్పనిసరి ప్రొటోకాల్స్, సోషల్ డిస్టెన్సింగ్, సరైన శానిటైజేషన్ ఫాలో అవ్వాలి.
2. తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఫస్ట్ షిప్ట్, సెకండ్ షిఫ్ట్ స్కూల్స్ కు రావాల్సింది. క్లాస్ 11, క్లాస్ 12 క్లాసులకు ఒకపూట ఉంటే సరిపోతుంది.
3. పేరెంట్స్ లేదా సంరక్షకుల నుంచి పర్మిషన్ ఉంటే క్లాసులకు స్టూడెంట్స్ ను అనుమతిస్తారు.
4. ఒక్కో స్టూడెంట్ 6అడుగుల దూరంతో కూర్చోవాలి.
5. శానిటైజర్, హ్యాండ్ వాష్, థర్మల్ స్క్రీనింగ్ వంటి ఏర్పాట్లు ప్రాథమిక ట్రీట్‌మెంట్లో భాగంగా ఏర్పాటు చేయాలి.
6. స్టూడెంట్, టీచర్ లేదా ఇతర ఉద్యోగులు జలుబు లేదా జ్వరం లక్షణాలు కనిపిస్తే ప్రాథమిక నిర్థారణ చేసి ఇంటికి పంపేయాలి.
7. టీచర్లు, స్టూడెంట్లు, వర్కర్లు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి. స్కూల్ మేనేజ్‌మెంట్ కూడా ఇది పర్యవేక్షించాలి.
8. ఆన్‌లైన్ టీచింగ్ కంటిన్యూ చేయొచ్చని.. ఎంకరేజ్ చేస్తూ యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. స్కూల్స్ కు వచ్చిన వారికే ప్రియారిటీ ఎక్కువగా ఉండాలని చెప్పింది.
9. స్కూల్ బస్సులు ప్రతి రోజూ శానిటైజ్ చేస్తూ.. నిర్ణీత దూరంలో కూర్చోబెట్టాలి.
10. స్కూల్ కు రావాలని ఏ విద్యార్థిని బలవంతపెట్టకూడదు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *