Home » విశాఖలో అలజడి : కైలాసగిరి కొండల్లో మంటలు
Published
2 years agoon
By
veegamteamవిశాఖపట్నం ఉలిక్కిపడింది. సిటీ నుంచి అందంగా కనిపించే కైలాసగిరి కొండలు ఎరుపెక్కాయి. పచ్చగా ఉండాల్సిన చెట్లు అగ్నికి ఆహూతి అయ్యారు. కొండల్లో పుట్టిన మంట.. అంతకంతకు వ్యాప్తిస్తూ వెళుతుంది. ఇప్పటికే పదుల హెక్టర్లలో మంటలు వ్యాపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కైలాసగిరి కొండల్లో మంటలను అదుపు చేయటం ఫైరింజన్ల వల్ల కూడా సాధ్యం కావటం లేదు. భారీ ఎత్తున ఎగసిపడుతున్న మంటలతో విశాఖ సిటీ జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
కైలాసగిరి కొండలు సింహాచలం వరకు విస్తరించి ఉన్నాయి. ఈ కొండల్లోనే కొన్ని గూడెంలు కూడా ఉన్నాయి. వారి పరిస్థితి ఏంటనే ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఉదయం అంతా పచ్చగా కనిపించిన కొండ.. సాయంత్రానికి మండే అగ్నికీలలతో బీభత్సంగా మారింది. ఈ మంటలు వ్యాపించకుండా అదుపు చేయటానికి అధికార యంత్రాంగం అంత రంగంలోకి దిగింది.
కైలాసగిరి కొండల్లో మంటలకు కారణం బొగ్గు మాఫియాకు ప్రచారం జరుగుతుంది. పచ్చని చెట్లను కాల్చేస్తే వచ్చే బొగ్గుతో వ్యాపారం చేయొచ్చనే కుట్రలో భాగంగానే.. కొండకు నిప్పు పెట్టారని అంటున్నారు కొందరు. ఏది ఏమైన కొండలో మంటలు.. కలకలం రేపుతున్నాయి.