లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 24 గంటల్లో 81 కేసులు

Published

on

Massively reduced corona cases in AP : ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. భారీగా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రెండంకెల్లో రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 27 వేల 861 శాంపిల్స్ పరీక్షించగా..81 మంది కొవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కొవిడ్ వల్ల విశాఖలో ఒకరు చనిపోయారని, గడిచిన 24 గంటల్లో 236 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 1,26,04,214 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది.

జిల్లాల వారీగా :

అనంతపురం : 0. చిత్తూరు 15. ఈస్ట్ గోదావరి : 03. గుంటూరు : 13. కడప : 19. కృష్ణా : 06. కర్నూలు : 04. నెల్లూరు : 01. ప్రకాశం : 06. శ్రీకాకుళం : 04. విశాఖపట్టణం : 07. విజయనగరం : 01. వెస్ట్ గోదావరి : 02. మొత్తం 81.

రాష్ట్రంలో నమోదైన మొత్తం 8,83,171 పాజిటివ్ కేసు లకు గాను 8,74,317 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. మొత్తం రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి 7,141 మంది మరణించారని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,713గా ఉందని వెల్లడించింది.