లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘నో టెన్షన్ బేబీ’ – కుట్టిస్టోరి సాంగ్ విన్నారా..

ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ నుండి ‘కుట్టి స్టోరీ’ లిరికల్ సాంగ్ రిలీజ్..

Published

on

Master - Kutti Story Lyrical song

ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ నుండి ‘కుట్టి స్టోరీ’ లిరికల్ సాంగ్ రిలీజ్..

కోలీవుడ్ ‘ఇళయ దళపతి’ విజయ్ హీరోగా ఇటీవల ‘ఖైదీ’ చిత్రంతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్’. ఎక్స్ బి ఫిలిమ్ క్రియేటర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, నాజర్, సంజీవ్, సంతానం ఇతర పాత్రల్లోనూ, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు.

ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్, సెకండ్ లుక్ పోస్టర్స్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా నుండి యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ‘కుట్టి స్టోరి’ అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

అరుణ్ రాజా కామరాజ్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్‌ని హీరో విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కలిసి పాడడం విశేషం. జీవితం చాలా చిన్నది, మనకు లైఫ్‌లో కలిగే బాధలను, టెన్షన్స్‌ను పక్కన పెట్టి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ జీవించాలి అనే కాన్సెప్ట్‌తో మంచి జోష్‌తో సాగే ఈ సాంగ్‌కి యువత‌తో పాటు మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

Vijay - Vijay Sethupathi

Master

Vijay - Anirudh

ముఖ్యంగా ఇంగ్లీష్ లిరిక్స్ వింటుంటే అనిరుధ్ ‘కొలవెరి’ పాట గుర్తొస్తుంది. ఇక ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ సాంగ్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని వేసవి కానుకగా ఏప్రిల్ 9 న రిలీజ్ చేయనున్నారు.

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *