లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

30 రోజులకే ఓటీటీలో ‘మాస్టర్’

Published

on

Master Movie: ‘దళపతి’ విజయ్ కథానాయకుడిగా.. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా.. మాళవికా మోహనన్ కథానాయికగా నటించిన కోలీవుడ్ కమర్షియల్ మూవీ ‘మాస్టర్’.. ‘ఖైది’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో.. ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళ్, తెలుగులో భారీగా విడుదలైంది.

మార్నింగ్ షో నుండే హిట్ టాక్‌తో, హైయ్యెస్ట్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం తీసుకొచ్చింది. తాజాగా ‘మాస్టర్’ రూ. 200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. ‘మెర్సల్’ (అదిరింది), ‘సర్కార్’,‘బిగిల్’ (విజిల్), తర్వాత రూ. 200 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిన విజయ్ నాలుగో చిత్రమిది.

Master

జనవరి 13 న రిలీజ్ అయిన ‘మాస్టర్’ ఫిబ్రవరి 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన 30 రోజులకే ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్‌లోకి రానుంది. ఈ ప్రభావం కలెక్షన్ల మీద పడే అవకాశముందంటున్నారు ట్రేడ్ వర్గాల వారు.