May 28th Menstrual Hygiene Day..educate both girls and boys says smriti irani

సిగ్గుపడొద్దు : రుతుస్రావంపై అబ్బాయిలను కూడా ఎడ్యుకేట్ చేయాలి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రుతుస్రావం అనేది సిగ్గుపడాల్సిన విషయంకానేకాదు..ఇది స్త్రీల శరీరంలో జరిగే అతి సహజైన ప్రక్రియ. ఈ విషయంలో కేవలం అమ్మాయిలనే కాదు అబ్బాయిలను ఎడ్యుకేట్‌ చేయాల్సిందిగా కేంద్ర మహిళా-శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. నేడు మెనుస్ట్రియల్‌ హైజిన్‌ డే. (రుతు పరిశ్రత రోజు) 

మే 28 నేడు మెనుస్ట్రియల్‌ హైజిన్‌ డే. (రుతు పరిశ్రత రోజు)  సందర్భంగా మంత్రి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. రుతుస్రావం సమయంలో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జన్‌ ఔషది కేంద్రాల్లో అందుబాటు ధరలకే యువతులకు..మహిళలకు శానిటరీ నాప్‌కిన్స్‌ను లభిస్తున్నాయని తెలిపారు. 

దేశంలోని మహిళలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా మంత్రి కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత, రుతుస్రావంపై అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం మే 28న మెనుస్ట్రియల్‌ హైజిన్‌ డే ను నిర్వహిస్తున్నామని తెలిపారు.

మహిళ జీవన చక్రంలో రుతుస్రావం అనేది ఎప్పుడూ ఆటంకంగా మారకూడదన్నారు. అది ఎప్పుడూ అవరోధంగా మారకూడదు. ప్రతి స్త్రీకి సురక్షితమైన కాలం గడిపే అర్హత ఉంటుంది. పరిశుభ్రత ప్రతీ స్త్రీ హక్కు అని మంత్రి తెలిపారు.

 

Related Posts