Home » COVID 19 Telangana : 24 గంటల్లో 761 కేసులు, కోలుకున్నది 702 మంది
Published
2 months agoon
By
madhuCOVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి 600 నుంచి 800 మధ్యే కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 761 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం వెల్లడించింది.
ప్రతి 100 సెకన్లకు 20ఏళ్ల లోపు ఒకరు HIV బారిన పడ్డారు : UNICEF
మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 67 వేల 665కు చేరుకున్నాయి. కోలుకున్న వారి సంఖ్య 702గా ఉంది. మొత్తం 2 లక్షల 55వేల 378మంది కోలుకున్నారు. నలుగురు చనిపోవడంతో మరణాల సంఖ్య 1448కు చేరుకుంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేల 839 ఉండగా..గృహ/ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 8,651ఉందని వెల్లడించింది.
ఇక జిల్లాల వారీగా కేసులు చూస్తే…
ఆదిలాబాద్ 04. భద్రాద్రి కొత్తగూడెం 33. జీహెచ్ఎంసీ 136. జగిత్యాల 21. జనగామ 02. జయశంకర్ భూపాలపల్లి 09. జోగులాంబ గద్వాల 07. కామారెడ్డి 12. కరీంనగర్ 32. ఖమ్మం 28. కొమరం భీం ఆసిఫాబాద్ 01. మహబూబ్ నగర్ 10.
మహబూబాబాద్ 17. మంచిర్యాల 29. మెదక్ 14. మేడ్చల్ మల్కాజ్ గిరి 69. ములుగు 18. నాగర్ కర్నూలు 09. నల్గొండ 28. నారాయణపేట 04. నిర్మల్ 02. నిజామాబాద్ 18. పెద్దపల్లి 18. రాజన్న సిరిసిల్ల 28. రంగారెడ్డి 55. సంగారెడ్డి 18. సిద్దిపేట 30. సూర్యాపేట 33. వికారాబాద్ 11. వనపర్తి 05. వరంగల్ రూరల్ 17. వరంగల్ అర్బన్ 24. యాదాద్రి భువనగిరి 18. మొత్తం : 761.
Telugu Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 27.11.2020)@Eatala_Rajender @TelanganaHealth @GHMCOnline pic.twitter.com/l6ULD5ZqdL
— Dr G Srinivasa Rao (@drgsrao) November 27, 2020