నగరంలో వర్షాల దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Hyderabad Floods : హైదరాబాద్ నగరంలో వర్షాల దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. అంటువ్యాధులు (endangered diseases) ప్రబలకుండా 182 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది. 102, 104, 108 వాహనాలను అందుబాటులో ఉంచామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.బస్తీ దవాఖానాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 24 గంటల పాటు ఈ మెడికల్ క్యాంపులు పనిచేస్తాయన్నారు.తాగునీటి శాంపిల్స్ పరీక్షలకు పంపిస్తున్నామని, కలుషిత నీటి వల్ల అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందన్నారు. జీహెచ్ఎంసీ రిలీఫ్ సెంటర్‌లో ప్రతిచోట మెడికల్ క్యాంప్ ఉందని చెప్పారు. అందులో కోవిడ్ పరీక్షలు కూడా చేస్తున్నామని శ్రీనివాస్ చెప్పారు.

Related Posts