లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మీరు చొక్కా విప్పితే స్టైల్ అంటారు.. మా చున్నీ జారితే రచ్చ రచ్చ చేస్తారు..

‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’- కాజల్ అగర్వాల్ రిలీజ్ చేసిన ‘వద్దొద్దు తల్లో మీకో దండం’ వీడియో సాంగ్..

Published

on

Meeko Dhandam Video Song - 30 Rojullo Preminchadam Ela

‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’- కాజల్ అగర్వాల్ రిలీజ్ చేసిన ‘వద్దొద్దు తల్లో మీకో దండం’ వీడియో సాంగ్..

టెలివిజన్ హోస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా పరిచయమవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ‘ఆర్య 2’, ‘నేనొక్కడినే’ సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

అమృత అయ్యర్ కథానాయిక. ఇటీవల విడుదల చేసిన ‘నీలి నీలి ఆకాశం’ పాట సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. 60 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. తాజాగా ‘వద్దొద్దు తల్లో మీకో దండం’ అనే వీడియో సాంగ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రిలీజ్ చేశారు.

30 Rojullo Preminchadam Ela

అనూప్ రూబెన్స్ ట్యూన్‌కి.. ‘నీలి నీలి ఆకాశం’ పాట రాసిన చంద్రబోస్ లిరిక్స్ రాయగా ధనుంజయ్, మోహనా భోగరాజు పాడారు. మ్యూజిక్, లిరిక్స్, శేఖర్ మాస్టర్ స్టెప్స్.. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, ప్రదీప్, అమృత వేసిన బ్యూటిఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ సాంగ్‌కు హైలెట్ అయ్యాయి.

అమ్మాయిల తప్పులను ఎంచుతూ అబ్బాయిలు, అబ్బాయిల మిస్టేక్స్‌ను ఎండగడుతూ అమ్మాయిలు పాడే ఈ పాట యువతని బాగా ఆకట్టుకుంటోంది. రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 3 మిలియన్ల వ్యూస్ దాటేసి ట్రెండింగ్‌లో ఉందీ పాట.. ఇటీవలే సెన్సార్ పనులు పూర్తయ్యాయి. మార్చి 25న ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *