Meeku Maathrame Cheptha - Review

మీకు మాత్రమే చెప్తా – రివ్యూ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోెగా, విజయ్ దేవరకొండ నిర్మాతగా రూపొందిన ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీ రివ్యూ..

‘పెళ్ళి చూపులు’.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుని హీరోగా నిలదొక్కుకున్న విజయ్ దేవరకొండ ఫస్ట్ టైమ్.. నిర్మాతగామారాడు. ‘నోటా’ సినిమాతోనే ప్రొడ్యూసర్‌గా మొదటి అడుగు వేసిన విజయ్ దేవరకొండ.. ‘మీకుమాత్రమే చెప్తా’ అని రొమాంటిక్ కామెడీ డ్రామాతో పూర్తిస్థాయి ప్రొడ్యూసర్‌గా టర్న్ తీసుకున్నాడు. తనకు ‘పెళ్ళి చూపులు’ సినిమాతో హీరోగా బ్రేక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్‌ను.. హీరోగా పరిచయం చేస్తూ.. తన రూటే సెపరేట్ అని ప్రూవ్ చేసుకున్నాడు.

అభినవ్ గోమఠం, అనసూయ, వాణీ బోజన్ లాంటి టాలెంటెడ్ స్టార్ కాస్ట్ దొరకడంతో.. కొత్త డైరెక్టర్ అయిన షమ్మీర్ సుల్తాన్ ఈ సినిమాను ప్రామిసింగ్‌గా తెరకెక్కించాడని ట్రైలర్స్‌తో కన్వే అయ్యింది. విజయ్ ప్రొడ్యూసర్‌గా ఇంట్రడ్యూస్ అవడం.. తరుణ్ భాస్కర్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం.. ఈ సినిమా ప్రోమోస్ చూడగానే కనెక్ట్ అయ్యే విధంగా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. ముఖ్యంగా యూత్ ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు.. మరి ఆ రేంజ్‌లో అంచనాలు పెంచిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ఎలా ఉంది. ఏ మేరకు ఆకట్టుకుంది.. హిట్టు మెట్టు ఎక్కిందా లేదా అనేది  ఇప్పుడు చూద్దాం..

కథ :
చిన్న నాటి ఫ్రెండ్స్ అయిన రాకేష్, కామేష్.. ఓ ఛానెల్‌లో వీడియో జాకీలుగా వర్క్ చేస్తుంటారు. రాకేష్ తొలిచూపులోనే డాక్టర్ స్టెఫీని చూసి ప్రేమలో పడతాడు. స్టెఫీ కూడా రాకేష్‌ను ప్రేమిస్తుంది. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. తన మేనరిజమ్స్‌తో… స్టెఫీని ఇంప్రెస్ చేసి, పెళ్లి వరకు తీసుకువస్తాడు. అయితే సినిమాల్లో నటించి, ఓ సెలబ్రెటీ అవ్వాలనే కోరిక ఉన్న రాకేష్, కొన్ని నెలల ముందు ఒక సినిమాకు సంబంధించి హనీమూన్ బ్యాగ్రౌండ్‌లో సాగే వీడియోలో నటిస్తాడు. కరెక్ట్‌గా పెళ్ళికి రెండు రోజుల ముందు ఆ వీడియో యూట్యూబ్‌లో ప్రత్యక్షం అవుతుంది. స్టెఫీ దగ్గర తాను మంచోడినని మార్కులు కొట్టేసిన రాకేష్‌కు, ఆ వీడియో ఎలాంటి చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ వీడియోను స్టెఫీ చూడకుండా ఉండేందుకు రాకేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు.. తన ఫ్రెండ్ సిస్టర్ అయిన సంయుక్తకు ఈ వీడియోకు లింక్ ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవలస్సిందే.. 

Read Also : ఆవిరి – రివ్యూ

​​​​​​​
నటీనటులు :
డైరెక్టర్‌గా తానేంట్ ప్రూవ్ చేసుకున్న తరుణ్ భాస్కర్.. ‘ఫలక్‌నుమాదాస్’ తో యాక్టింగ్‌లో కూడా తన ప్రొటెన్షియాలిటీ ఏంటి అనేది శాంపిల్‌గా చూపించాడు. ఈ సినిమా విషయానికి వచ్చే సరికి రాకేష్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్‌ను సైతం అలవోకగా పండిస్తూ.. రాకేష్ క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ నటన చూస్తే… అక్కడక్కడ ‘పెళ్లి చూపులు’ లో విజయ్ దేవరకొండను చూసినట్టు అనిపిస్తుంది. ఇక ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమఠంకు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. పుల్‌లెంగ్త్ రోల్‌లో హీరో పక్కనే ఉంటూ.. తన సెటిల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో.. ఇన్నోసెంట్ బాడీలాంగ్వేజ్‌తో సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాడు. అనసూయ కూడా పాత్ర పరిధి చిన్నదే అయినా.. ఇంపార్టెన్స్ ఉన్న రోల్ దక్కింది. వాణీ బోజన్, అవంతికా, పావని గంగిరెడ్డితో పాటు మిగిలిన నటీనటులు  కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 

READ  ప్రగతి స్టెప్స్ చూస్తే సీటీ కొట్టడం పక్కా..

 

టెక్నీషియన్స్ :
మలయాళీ డైరెక్టర్ అయిన షమ్మీర్ సుల్తాన్.. స్క్రీప్ట్‌ను నమ్ముకుని చేసిన నాలుగేళ్ళ జర్నీకి పూర్తి న్యాయం చేయడంలో కాస్త తడబడినా.. తనదైన మార్క్‌ను చూపించ గలిగాడు. విజయ్ దేవరకొండ అతని కథను నమ్మి.. ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో తరుణ్ భాస్కర్ పండించినట్టుగానే.. అండర్ కామెడీతో.. కథను నడిపిన విధానం బాగుంది. అలాగే ముందు నుండి తనను, తన కథను నమ్మి ట్రావెల్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శివకుమార్, డిఓపీ శ్రీదీప్ సాంరంగ్ ఈసినిమా అపుట్‌పుట్ బాగా రావడంలో తమ వంతు పాత్రను అందించారు. మ్యూజిక్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే సినిమా మరో లెవల్‌లో ఉండేది. ఈ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన వర్ధన్ దేవరకొండ  మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

ఓవర్ ఆల్ గా….
ఎవర్ గ్రీన్ ఫార్ములాను.. రొమాంటిక్ కామెడీ నమ్ముకుని ఓ సెటైరికల్ స్టోరీతో తెరకెక్కించిన మీకు మాత్రమే చెప్తా.. యూత్‌ను ఆకట్టుకునే విధంగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయితే.. మల్టీ ప్లెక్స్‌లో మాత్రమే కాకుండా బీసి సెంటర్స్‌లో కూడా బాగానే వసూళ్లు చేసే అవకాశం ఉంది. 

ప్లస్ పాయింట్స్  
కామెడీ
డైలాగ్స్ 
లీడ్ యాక్టర్స్ 
రన్ టైమ్ 

మైనస్ పాయింట్స్ 
సింగిల్ పాయింట్ స్టోరీ
నెమ్మదిగా సాగే కథనం
సెకండ్ హాఫ్ 

Related Posts