లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

పెళ్ళి వద్దని ఇంటి నుంచి పారిపోయి…7 ఏళ్ల తర్వాత సివిల్ అధికారిగా తిరిగివచ్చిన అమ్మాయి

Published

on

ప్రస్తుతం ఉన్న రోజుల్లో అమ్మాయిలు కూడా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉంటున్నారు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల తమ లక్ష్యాలను సాధించాలనే ఆశ ఉన్న కొంతమంది అమ్మాయిలు మాత్రం పెద్దల ఒత్తిడి తలవచుకుని వివాహం చేసుకుంటున్నారు. కుటుంబ బాధ్యతను మోస్తున్నారు.

తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ ప్రాంతానికి చెందిన సంజూ రాణి వర్మ మాత్రం.. తన కలలను నెరవేర్చుకోవడానికే ఎక్కువ మెుగ్గు చూపింది. పెళ్లి చేస్తామని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తుండటంతో, ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఏడు సంవత్సరాల తర్వాత ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ లో ఉద్యోగం సాధించింది తన కలలను నెరవేర్చుకుంది.


వివరాల్లోకి వెళ్లే… 2013లో సంజూరాణి తల్లి అనారోగ్యంతో మరణించింది. అప్పటికే సంజూ డిగ్రీ పూర్తి చేసి, ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చదువుతోంది. అమ్మ చనిపోయింది. నువ్వు చదువు ఆపేసి పెళ్లి చేసుకో అని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. కానీ తను సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానాను ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పినా ఇంట్లో వాళ్లు వినలేదు.
ఓవైపు పెళ్లి చేసుకోమని ఒత్తిడి, మరోవైపు యూపీస్సీలో ఉద్యోగం సాధించాలనే తన కల…. ఈ రెండింటిలో తన లక్ష్యాన్ని సాధించటం చాలా ముఖ్యమని నిర్ణయించుకుంది. తన కల వైపు ఎక్కువ ఆసక్తిని కనపరించింది.

పెళ్లి పేరుతో సహజీవనం….మరోకరితో పెళ్లి…బంజారా హిల్స్ పీ.ఎస్.లో కేసు నమోదు


ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంజూ మాత్రం పీజీని మధ్యలోనే ఆపేసి, ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. దీంతో పాటు ప్రైవేట్ స్కూళ్లలో పార్ట్ టైం టీచర్‌గా పని చేసింది. అలా పని చేస్తూ సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యింది.

2018 యూపీపీఎస్సీ సివిల్ ఎగ్జామ్ లో సంజూకు మంచి మార్కులొచ్చాయి. గత వారమే ఈ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో ఆమె త్వరలోనే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌ ఉద్యోగంలో చేరనుంది. సివిల్ సర్వీసెస్‌‌ రాసి జిల్లా మెజిస్ట్రేట్ కావాలనేది తన లక్ష్యమని సంజూ తెలిపింది.


తను ఇంట్లో నుంచి వెళ్లిపోయి సొంతంగా బతకడం మొదలుపెట్టినప్పుడు కుటుంబ సభ్యులు బాధపడ్డారని.. కానీ ఓ ఆఫీసర్‌గా తను పొందే గౌరవాన్ని చూసి వాళ్లు ఆనందిస్తారనే విషయం తెలుసని సంజూ చెప్పింది. ‘నా బాధ్యతలేంటో నాకు బాగా తెలుసు, నా కుటుంబానికి సాధ్యమైన విధంగా అండగా ఉండాలనుకుంటున్నాను. కానీ మీ అమ్మాయి చదువు ఆపేయించి.. పెళ్లి చేసేయ్ అనే సమాజ ఒత్తిడే నాకు అర్థం కావడం లేద’ని తన ఆవేదన గురించి సంజూ చెప్పుకొచ్చింది.


సంజూ ప్రయివేట్ స్కూళ్లలో పని చేస్తూ యూపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న సమయంలో ఆమెకి అభిషేక్ శర్మ అనే టీచర్ ఎంతో సహాయం చేశారని చెప్పింది. అంతేకాకుండా మెయిన్స్ ఎగ్జామ్స్ మరో 18 రోజులు ఉందనగా పరీక్షలు వాయిదా పడ్డాయి. అప్పటికే చికెన్ ఫాక్స్‌తో ఇబ్బంది పడుతున్న ఆమె.. పరీక్షలు వాయిదా పడటంతో ఎంతో సంతోషించినట్లు చెప్పింది.

అంతేకాకుండా ఈసారి మెయిన్ పరీక్ష ఖచ్చితంగా క్లియర్ చేస్తానని తెలుసునని చెప్పుకువచ్చింది. అనుకున్నట్టే మెయిన్స్ పరీక్షను క్లియర్ చేసి, మంచి మార్కులు సాధించింది. చివరికి తన కలలను నెరవేర్చుకుని అందరీకి ఆదర్శంగా నిలిచింది సంజూ.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *