meet-cute-in-amsterdam-proposal-in-udaipur-then-shaadi-with-a-twist

ఆడవాళ్లు మాత్రమే ఎందుకుచేయాలి ?వధువు కాళ్ళు మొక్కిన వరుడు..ఇంటిపేరు కూడా మార్చుకున్నాడు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో జరిగే చాలా ఘట్టాల్లో వధువు వరుడు కాళ్ల పట్టుకుని దణ్ణం పెడుతుంటుంది. ప్రధానం తాడుకట్టినప్పుడు..తాళి కట్టినప్పుడు..నల్లపూసలు కట్టినప్పుడు ఇలా చాలాసార్లు వరుడి కాళ్లకు మొక్కుతుంటుంది. కానీ వరుడు మాత్రం దర్జాగా నిలబడి వధువుని దీవించేస్తుంటాడు.


అలా వరుడు వధువు మెడలో మాంగళ్యధారణ తరువాత వధువు వరుడి కాళ్లను నమస్కరిస్తుంది. కానీ వరుడు ఎప్పుడూ వధువు కాళ్లకు నమస్కరించడు. పెళ్లి తరువాత వధువు ఇంటిపేరు మారుతుంది. వరుడు ఇంటిపేరు మారదు. కానీ ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఓ పెళ్ళిలో సీన్ రివర్స్ అయింది. ఓ పెళ్లిలో వధువు కాళ్లకు వరుడు మొక్కాడు. ఆమె కాళ్లు పట్టుకుని దణ్ణం పెట్టుకున్నాడు.


ఈ సీన్ రివర్స్ పెళ్లి విశేషాలేంటో చూద్దాం.. ఉదయ్‌పూర్‌కు చెందిన దీపా ఖోస్లా ఉన్నత చదువుల కోసం నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌కి వెళ్ళింది. అక్కడే దీపకు స్టూడెంట్ లీడర్ ఒలేగ్‌ బుల్లర్‌తో పరిచయమైంది. వారి పరిచయం ప్రేమగా మారింది.

వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు సంతోషంగా ఒప్పుకున్నారు. దీంతో వీరి పెళ్లికి లైన్ క్లియర్ అయ్యింది. వీరు యూరోపియన్‌, భారతీయ సంస్కృతుల కలయికగా పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతుండగా దీపను ఒలేగ్‌ పాదాలకు నమస్కరించమని పురోహితుడు చెప్పాడు. ఆమె అలాగే చేసింది. దానికి ‘‘వధూవరులు ఇద్దరూ సమానమే..మరి అటువంటప్పుడు ఆడవారు మాత్రమే ఎందుకు అలా చెయ్యాలి? అని ప్రశ్నించాడు వరుడు ఒలేగ్. దానికి పురోహితుడు ఇది సంప్రదాయం బాబూ అన్నాడు.


దాని ఒలేగ్ ఆడవాళ్లు మగవాళ్లు ఇద్దరూ సమానమే ఆమె నా పాదాలకు మొక్కింది. నేను కూడా ఆమె పాదాలకు మొక్కుతాను అంటూ వరుడు ఒలేగ్ వధువు దీప పాదాలను తాకాడు. అంతేకాదు వధూవరులిద్దరూ ఒకరి ఇంటి పేరు ఒకరు మార్చుకున్నారు. వధువు దీప బుల్లర్‌ ఖోస్లా అని పెట్టుకోగా.. వరుడు ఒలేగ్‌ బుల్లర్‌ ఖోస్లా అని మార్చుకున్నాడు. ఇలా చేయడం చాలా గర్వంగా ఉందని వధూవరులు తెలిపారు. రెండు సంప్రదాలతో పెళ్లి చేసుకోవటమే కాదు సమానత్వంతో ఆలోచించిన వారిని పెద్దలు ప్రశంసిస్తూ..ఆశీర్వదించారు. వీరి పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పెళ్లి పేరుతో ఆడవారికి సంబంధించిన అన్నీ మారటం విషయంలో వీరిద్దరూ మంచి మార్గానికి బాటలు వేశారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇలా అందరూ ఆలోచిస్తే ఆడవారి పట్ల వివక్ష పోతుందని అంటున్నారు. పెళ్లి పేరుతో ఆడవారి ఇంటిపేరుతో పాటు అన్ని మారిపోతాయి. పద్దతులు..ఆనవాయితీలు..అలవాట్లు అన్నీ మారిపోతాయి. అలాగే పెళ్లి తతంగం నుంచి ఈ సంప్రదాయం ప్రారంభమవుతాయి. కానీ దీపా ఖోస్లా..ఒలేగ్ బుల్లర్ పెళ్లి ఆలోచింపజేసేలా ఉందంటున్నారు పలువురు.

Related Posts