Meet India’s first transgender football team

ఇండియా ఫ‌స్ట్ ట్రాన్స్ జెండ‌ర్ ఫుట్ బాల్ టీం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మ‌ణిపూర్ వాసుల్లో అత్య‌ధిక ఆద‌ర‌ణ క‌లిగిన క్రీడ‌ల్లో ఫుట్ బాల్ ఒక‌టి. ఇందులో ట్రాన్స్ జెండ‌ర్స్ పాల్గొన‌డం ప్ర‌దాన ఆక‌ర్ష‌ణ కానుంది. యువ‌జ‌న‌, త్రిలింగీయుల సాధికారిత‌కు కృషి చేస్తున్న యా ఆల్ ఎన్జీవో సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు, పీహెచ్ డీ విద్యార్థి స‌ద‌మ్ హంజాబ‌మ్ ప్రోత్సాహంతో 14 మంది స‌భ్యుల గ‌ల త్రిలింగీయులు ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొన‌నున్నారు.

వీరు ఆరుగురు చొప్పున రెండు జ‌ట్లుగా విడిపోయి ప‌ర‌స్ప‌రం పోటీ ప‌డ‌నున్నారు. త్రిలింగీయుల‌ను రెండుగా విభ‌జించ‌డం అంటే…పురుషులుగా మారిన వారిని ఓ జట్టుగా, స్త్రీలుగా మారిన వారిని ఓ జట్టుగా చేసి పోటీలు నిర్వ‌హించిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఆద‌రించారు. 2018, 2019 సంవత్సరాల్లో త్రిలింగీయులతో వరుసగా ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లు నిర్వహించారు. గత మార్చి నెలలో ఇంఫాల్‌లో నిర్వహించిన టోర్నమెంట్‌కు ప్రజల నుంచి ఫుల్ రెస్పాన్స్ వ‌చ్చింది. 

ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. యేవ్ శాంగ్ పండుగ‌ను ఇక్క‌డి వారు ఘ‌నంగా జ‌రుపుకుంటుంటారు. వ‌సంతం రాక‌కు సూచిక‌గా ఈ పండుగ‌ను జ‌రుపుకుంటుంటారు. ఈ పండుగ‌ను మ‌ణిపూర్ హోలీ పండుగ‌గా కూడా అభివ‌ర్ణిస్తారు. ఐదు రోజుల పాటు ఈ పండుగ జ‌రుగ‌నుంది. అన్ని వ‌ర్గాల వారు, అన్ని కులాలు, చిన్నా పెద‌ద అనే తేడా లేకుండా…అంద‌రూ సంతోషంగా ఇందులో పాల్గొంటుంటారు. ముగింపు సంద‌ర్భంగా..సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. 
 

Related Posts