బాలయ్య, నాగ్, తారక్ గురించి నాగబాబు షాకింగ్ కామెంట్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Naga Babu On Nepotism: ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ వారసత్వం గురించి, బంధుప్రీతి గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. సినీ వారసత్వం ఉన్న వారిని తప్ప బయటి వారిని ఎదగనివ్వడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడారు.‘మా కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ ఎంతో కష్టపడిన తర్వాతే తెరపైకి వచ్చారు. బన్నీ, చరణ్, వరుణ్, సాయితేజ్, నిహారిక అందరూ తమ కెరీర్ కోసం, సినిమా కోసం విపరీతంగా కష్టపడతారు. ఎన్టీయార్ కొడుకు కాబట్టే బాలకృష్ణ స్టార్‌ అయ్యారనడం సరికాదు. ఆయనకంటూ సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకుని అభిమానులను అలరిస్తున్నారు. ఇక, ఏఎన్నార్ కొడుకు కాబట్టి నాగార్జునను చూసెయ్యలేదు. ఆయన తన గ్లామర్‌తో, నటనతో ‘కింగ్’గా ఎదిగారు.అలాగే జూనియర్ ఎన్టీయార్ ఎంత కష్టపడతాడో నేను స్వయంగా చూశాను. ‘అరవింద సమేత’ షూటింగ్ సమయంలో 44 డిగ్రీల ఎండలో షర్ట్ కూడా లేకుండా ఫైట్ చేశాడు. అలాగే మహేష్ బాబు కాస్త లావుగా ఉండేవాడు. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు కేబీఆర్ పార్కులో రోజూ రన్నింగ్ చేసేవాడు. చూస్తుండగానే స్లిమ్‌గా తయారైపోయాడు. కష్టపడకపోతే ఎవరికీ ఇక్కడ చోటు లేదు. దేవుడి కొడుకైనా.. అతడు నచ్చకపోతే ప్రజలు తిరస్కరిస్తారు’ అన్నారు నాగబాబు.


Related Posts