లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మెగాస్టార్ ఇంటికి పిలిస్తే.. మాటలొస్తాయా మరి!

Published

on

megastar-chiranjeevi-praises-bluff-master-director-gopi-ganesh

సత్యదేవ్, నందితా శ్వేత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. తమిళ్ సినిమా ‘సతురంగ వేట్టై’ కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 2018లో విడుదలైంది. తాజాగా ఈ చిత్ర దర్శకుడిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. అదేంటి అప్పుడెప్పుడో సినిమా విడుదలైతే.. ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడిని చిరంజీవి మెచ్చుకోవడం ఏమిటి? అనుకుంటున్నారా.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు. అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ టైమ్‌లో ఇంట్లోనే చిరంజీవి పలు సినిమాలను వీక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాన్ని చూడటం జరిగింది.

Bluff Master ఇక ఈ సినిమా ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే ఆ చిత్ర దర్శకుడు గోపీ గణేష్‌ను ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు. టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి టాప్ ప్లేస్‌లో ఉంటారనే విషయం తెలిసిందే. అది ఇప్పటికే ఎన్నో సందర్భాలలో నిరూపితం అయ్యింది. ఇప్పుడు గోపీ గణేష్ వంతు వచ్చింది. ట్విట్టర్ ద్వారా గోపీ గణేష్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘బ్లఫ్ మాస్టర్ సినిమాను చూసి చిరంజీవి గారు ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించడం ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన విశాల హృదయం ఏమిటో మరొక్కసారి తెలిసింది. నా గురించి ఆయన చెప్పిన మాటలను ఎప్పటికీ హృదయంలోనే దాచుకుంటాను. ఆయనకు ధన్యవాదాలు..’’ అంటూ గోపీ గణేష్ తన ఆనందాన్ని పంచుకున్నారు.

Gopi Ganesh

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *