లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మెగా లైనప్.. నాన్ స్టాప్ నాలుగు సినిమాలు..

Published

on

Chiranjeevi: మెగాస్టార్ మాంచి స్పీడుమీదున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక అసలు ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా సినిమాలన్నీ లైనప్ చేస్తున్నారు. రీ ఎంట్రీ తర్వాత రకరకాల ప్రయోగాలు చేస్తూ.. ఆడియన్స్‌కి బోర్ కొట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే అసలు ఆడియన్స్ ఎవరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యని డైరెక్టర్స్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాన్ స్టాప్ నాలుగు సినిమాలతో లైనప్ ఎరేంజ్ చేసుకున్నారు. అంతేకాదు ఈ నలుగురు డైరెక్టర్లతో నలుగురు క్రేజీ డైరెక్టర్లతో నాలుగు అడుగులు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్ ప్రజెంట్ వైరల్ అవుతోంది.

మెగాస్టార్ నాలుగు క్రేజీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక జానర్‌కి ఒక జానర్‌కి సబంధం లేకుండా తన ఇమేజ్‌తో సంబంధం లేకుండా సినిమాల్ని తియ్యగల డిఫరెంట్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. సోషల్ మెసేజ్‌కి కమర్షియాలిటీని యాడ్ చేసే కొరటాల శివ, కథకి- కథనానికి ఇంపార్టెన్స్ ఇచ్చే మోహన్ రాజా, గ్రాండియర్- యాక్షన్‌తో సినిమాలు చేసే మెహర్ రమేష్, సింపుల్‌గా ఆడియన్స్ కోసం సినిమాలు చేసే బాబీ.. ఇలా అసలు ఎక్కడా మ్యాచ్ కాని కాంబినేషన్స్‌తో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్.

చిరంజీవి ప్రస్తుతం కొరటాల చేస్తున్న ‘ఆచార్య’ సినిమాతో ఫుల్ ఎంగేజ్ అయిపోయారు. ఈ సినిమాలో చరణ్ కూడా ఓ రోల్ ప్లే చేస్తుండడంతో సినిమా మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ఆడియన్స్‌కి. ఈ సినిమా కంప్లీట్ కాకుండానే మోహన్ రాజా తో ‘లూసిఫర్’ రీమేక్ స్టార్ట్ చేశారు. మొన్నీమధ్య పూజా కార్యాక్రమాలతో మొదలైన ఈ సినిమా మరో 10 రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

‘ఆచార్య’ తర్వాత యంగ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తానని ఆల్రెడీ అనౌన్స్ చేసిన మెగాస్టార్.. ఇప్పుడు మెహర్ రమేష్ తో ‘వేదాళం’ సినిమా చెయ్యబోతున్నారు. మెహర్ రమేష్ అంతకముందు చేసిన ‘శక్తి’, ‘కంత్రీ’, ‘బిల్లా’, ‘షాడో’ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా.. చిరంజీవి ఈ డైరెక్టర్‌తో సినిమా చెయ్యడం ఫ్యాన్స్‌కి ఒకరకంగా షాకింగ్ సర్‌ప్రైజే. వీళ్లతో పాటు యంగ్ డైరెక్టర్ బాబీ చెప్పిన లైన్ సూపర్‌గా నచ్చడంతో చిరంజీవి బాబీతో కూడా సినిమాకి సై అన్నారు. ఎప్పటినుంచో మెగాస్టార్ తో సినిమా చెయ్యడానికి వెయిట్ చేస్తున్న ఈ డైరెక్టర్లు తెగ ఖుష్ అవ్వడంతో పాటు.. సెకండ్ ఇన్సింగ్స్‌ని సూపర్ ఫాస్ట్‌గా ప్లాన్ చేసుకుని యంగ్ హీరోలని మించిపోతున్నారు చిరంజీవి.