రాక్ స్టార్ సీఎం : గిటార్ వాయించిన మేఘాల‌యా సీఎం సంగ్మా

Meghalaya cm conrad sangma plays his electric guitar

మేఘాల‌యా సీఎం కాన్‌రాడ్ సంగ్మా రాక్ స్టార్ అవతారం ఎత్తారు. తనలో దాగిన కళను మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు.  ఎల‌క్ట్రిక్ గిటార్‌పై కొన్ని బాణీలు వినిపించిన ఆయ‌న రాక్‌స్టార్‌లా మారారు. బిజీ బిజీ అసెంబ్లీ స‌మావేశాల త‌ర్వాత‌.. సీఎం సంగ్మా సేద తీరేందుకు త‌న ఎల‌క్ట్రిక్ గిటార్‌కు ప‌నిపెట్టారు. ఐర‌న్ మైడెన్ బ్యాండ్‌కు సంబంధించిన వేస్టెడ్ ఇయ‌ర్స్ ట్యూన్‌ని వినిపించారాయ‌న‌.  

1986లో రిలీజైన స‌మ్‌వేర్ ఇన్ టైమ్ ఆల్బ‌మ్‌లోని పాట‌ను త‌న గిటార్‌తో వాయించారు.  సీఎం త‌న గిటార్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ అప్‌లోడ్ చేయ‌గానే అది వైరల్ గా మారింది. పోస్ట్ చేసిన కొన్ని గంట‌ల్లోనే సుమారు 3 ల‌క్ష‌ల మంది చూశారు. 

కాగా..సీఎం గిటార్ పాట చూసిన మేఘాలయ ప్రజలు ఇదీ.. మా ముఖ్యమంత్రి రేంజ్’ అంటూ సంగ్మాను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఇదేదో రాజకీయ పరమైన ప్రసంశలు కాదండోయ్..ప్రజాభిమానం. మా సీఎం భలే వాయించారంటూ మురిసిపోతున్నారు మేఘాల వాసులు.

Read:  హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకంపై ICMR కీలక సిఫార్సులు

మరిన్ని తాజా వార్తలు