లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

వావ్.. వండర్‌ఫుల్ మష్రూమ్స్ : బల్బుల్లా వెలుగుతూ కాంతినిచ్చే పుట్టగొడుగులు..!!

Published

on

Meghalaya mysterious Mushrooms : పుట్టగొడుగులు. భారతదేశంలో పుట్టగొడుగుల్ని పంటగా పండిస్తుంటారు.వంటల్లో వాడుతుంటారు. వీటిలో చాలా రకాలుంటాయి. కానీ కరెంట్ బల్బుల్లా వెలిగే పుట్టగొడుగుల్ని ఎక్కడన్నా చూశారా? అంటే కాస్త ఆలోచించాల్సిందే. కానీ అలా బల్బుల్లా మెరుపులు మెరిపించే పుట్టగొడుగులు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చీకటి సమయంలో కరెంట్ బల్బుల్లా వెలిగే ఈ పుట్టగొడుగుల్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
మనదేశంలో దట్టమైన అడవులు దేశమంతా విస్తరించి ఉన్నాయి. వాటిలో… ఈశాన్య రాష్ట్రాల్లో అడవులు దట్టంగా ఉంటాయి. అక్కడ రకరకాల చెట్లు, మొక్కలు కనిపిస్తాయి. అందమైన వింత వింత పువ్వులు,కాయలు, వనమూలికలు, సుగంధ ద్రవ్యాలకు అక్కడి అడవులు పెట్టింది పేరు. మిగతా రాష్ట్రాల్లో కనిపించని ఎన్నో వింతలు విచిత్రాలు ఈశాన్య రాష్ట్రాల్లోని అడవుల్లో కనిపిస్తుంటాయి.ఈ క్రమంలో మేఘాలయాలో స్థానికులు ఎప్పుడూ చూడని మెరుపులతో కనువిందు చేసే పుట్టగొడుగుల్ని (Mushrooms) చూశారు. వెంటనే ఆ విషయం ఆనోటా..ఈనోటా సైంటిస్టుల వద్దకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన సైంటిస్టులు వాటిని ఫొటోలు తీసి ప్రపంచానికి చూపించారు. మెరిసే పుట్టగొడుగుల్ని చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. అవి కరెంట్ బల్బుల్లాగా కాంతిని వెదజల్లుతాయి. మన ఇంట్లో రాత్రి వేళ బెడ్ బల్బు మాత్రమే వెలిగితే… అది ఎలా కాంతిని ఇస్తుందో… అలా ఆ పుట్టగొడగులు కూడా కాంతిని వెదజల్లుతున్నాయి.

కరోనావైరస్‌‌ కొత్త లక్షణాలు : ముందస్తు హెచ్చరిక సంకేతాలివే..!
ఈ జాతి పుట్టగొడుగులను రోరిడోమిసెస్ హిల్లోస్టాఖిడిస్ (Roridomyces hyllostachydis) అని పిలుస్తారని సైంటిస్టులు తెలిపారు. వీటిని తొలిసారిగా ఆగస్టులో మేఘాలయ… ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలోని మాలిన్నాంగ్‌లో ఓ కాలువ పక్కన చూశారు. తర్వాత ఇవి వెస్ట్ జైన్షియా హిల్స్ జిల్లాలోని… క్రాంగ్ షురీలో కూడా కనిపించాయి. ఇప్పటివరకూ ఇలా మెరిసే పుట్టగొడుగుల జాతులు ఈ ప్రపంచంలో 96 ఉన్నాయని సైంటిస్టులు తెలిపారు. ఈ కొత్త జాతిని గుర్తించటంతో ఇవి 97 రకాలయ్యాయి.మేం మెరిసే పుట్టగొడుగుల్ని చూశాం : స్థానికులు ఆశ్చర్యానందాలు
మేఘాలయ స్థానికులు ‘‘మేం ఎలక్ట్రిక్ పుట్టగొడుగుల్ని చూశామనీ.. రాత్రి సమయాల్లో అవి కాంతి ఇస్తున్నాయని..అచ్చు మన ఇంటిలో బెడ్ బల్డు వేసుకున్నట్లుగా ఉన్నాయని తెగ ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేశారు. ఈ విషయం ఆనోటా ఈనోటా చేరి… చివరకు సైంటిస్టులకు తెలిసింది. వెంటనే ఓ సైంటిస్టుల టీమ్ అక్కడకు వెళ్లింది.Meghalaya mysterious Mushrooms

ఆ సైంటిస్టుల బృందాన్ని స్థానికులు వెదురుబొంగులు ఉండే చెట్ల అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ పెద్దగా ఎండ పడటంలేదు. అంతా మసక మసకగా చీకటిగా కూడా ఉంది. టార్చ్ లైట్ల సహాయంతో అంతా అక్కడకు వెళ్లారు. అలా అంతా అక్కడకు వెళ్లాక..స్థానికుడు ‘‘సార్..మీ చేతిలో టార్చ్ లైట్లను ఆర్పేయండి..అప్పుడు చూడండీ ఇక్కడి తమాషా’’అన్నాడు. వెంటనే అంతా టార్చ్ లైట్లు ఆర్పేశారు.అంతే…అచ్చంగా అవతార్ సినిమాలో లాగా… మిలమిలా మెరుస్తూ… అక్కడి ప్రదేశం కాంతితో నిండిపోయింది. అక్కడ కాంతులు వెదజల్లే పుట్టగొడుగులు కనిపించటంతో సైంటిస్టులు కూడా ఆశ్చర్యానందాలతో చూశారు.వాటిని చూసి సైంటిస్టులు “వావ్… వాటే వండ్రఫుల్ మష్రూమ్స్” అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిపారేశారు. అక్కడ ఉన్న వెదురు బొంగుల నుంచి ఈ పుట్టగొడుగులు పుట్టాయి. ఇవి గ్రీన్ కలర్‌లో మెరుస్తున్నాయి. వీటి నుంచి వచ్చే కాంతి కూడా గ్రీన్ కలర్ లోనే ఉంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *