ఈ కష్టాలుపడలేం..మమ్మల్ని బంగాదేశ్‌కు ఇచ్చేయిండి..నాలుగు గ్రామాల ప్రజల ఆవేదన

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఈ కష్టాలు పడలేకపోతున్నాం..ఎన్నేళ్లు గడిచినా మా గతి ఇంతే..మా కష్టాల్ని ఢిల్లీ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు..ఇటు మా రాష్ట్ర ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. ఎన్నో ఏళ్లనుంచీ ఎంతో ఓపిపట్టాం…ఎంతో ఆశగా ఎదురు చూశాం. ఇప్పటికైనా మా సమస్యలు తీర్చండి…లేదంటే మమ్మలందరినీ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించండి..అంటూ మేఘాలయలోని నాలుగు గ్రామాల ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. భారతదేశం-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు అంచున నివసిస్తున్న మేఘాలయలోని గిరిజన గ్రామస్తుల మనోవేదన ఇది.

దశాబ్దాల తరబడి రోడ్ల కోసం డిమాండ్ చేస్తున్న నాలుగు  గిరిజన గ్రామాలు
దశాబ్దాల తరబడి ప్రభుత్వాల నిర్లక్ష్యానికి పరాకాష్టగా కనిపిస్తోంది మేఘాలయ గిరిజన ప్రజల దుస్థితి. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని ఈస్ట్ జంతియా హిల్స్ జిల్లాలోని హింగారియా, హురి, లహలీన్, లెజ్రీ గ్రామాలకు సరైన దారి లేదు. వర్షకాలం వస్తే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే. రాంబాయ్, బతా, భోర్ఖత్, సోనాపూర్ ప్రాంతాలను కలిపే రోడ్డు వేస్తే మా సమస్య తీరుతుందని దీని కోసం ప్రభుత్వానికి ఎంతగా మొరపెట్టుకుని ఏమాత్రంపట్టించుకోవటంలేదని వాపోతున్నారు ఈ నాలుగు గిరిజన గ్రామాల ప్రజలు. కానీ..ఓట్ల కోసం వచ్చే నాయకులు గెలిచాక ఏమాత్రం పట్టించుకోవటంలేదని మేము ఓట్లు వేయటానికి తప్ప ఇంకెందుకు పనికిరామా అని ప్రశ్నిస్తున్నారు. మాసమస్యలు పట్టనీ మీరు మమ్మల్ని బంగ్లాదేశ్ దేశానికి మమ్మల్ని అప్పగించేయండి అంటూ గిరిజనులు వాపోతున్నారు.

రోడ్లు మాత్రమే కాదు ఎన్నో సమస్యలో బ్రతుకుతున్న గిరిజనులు
కేవలం రోడ్డు లేకపోవడమే కాదు, మరెన్నో సమస్యలు వీరిని వేధిస్తున్నాయి. మొబైల్ ఫోన్ల నెట్ వర్క్ కాదుకదా..ఏదన్నా రోగమొస్తే..మహిళలు ప్రసవించటానికి కూడా కనీస వైద్య సదుపాయాలు లేవు. 5 వేలకు పైగా జనాభా ఉన్న ఆ గ్రామాలు బంగ్లాదేశ్‌తో లావాదేవీలు జరుపుతూ బతులను ఈడ్చుకొస్తున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికైనా మా గోడు పట్టించుకోవాలని చేతులెత్తి మొక్కుతున్నారు.

చినుకు పడితే నరకమే
చినుకు పడితే బతుకు ఛిద్రమైనట్లే. అడుగు తీసి అడుగు వేయాలంటే భయంతో అడుగు వేయాల్సిన పరిస్థితి. వారి రోడ్లనువారే వేసుకుంటుంటారు. కానీ వర్షాకాలం వచ్చిదంటే ఆరో్డు కంటికి కనిపించవు.అన్నీ నీటితో నిండిపోతాయి. బురదతో జారిపోయే దారుల్లో నడుస్తు బ్రతుకులీడుస్తున్నారుఈ అమాయక గిరిజనులు. నగరాల్లో వందలాది కోట్లు ఖర్చుపెట్టి ఫ్లైఓవర్లు నిర్మించే ప్రభుత్వాలుమా ఊర్లలో కనీసం రోడ్లు కూడా వేయదా అని ప్రశ్నిస్తున్నారు. తూర్పు జైషియా హిల్స్ జిల్లా పరిధిలోకి వచ్చే ఈ నాలుగు గ్రామాలు మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

Read:గిరిజన విద్యార్థుల Online చదువుకోసం స్మార్ట్‌ టీవీలు ఇచ్చిన రాహుల్ గాంధీ

READ  వామ్మో, మద్యం మత్తులో ప్రియుడి నాలుక కొరికేసింది

Related Posts