Message on Coronavirus (COVID-19) Neither From UNICEF Nor Accurate

Fact Check: మాస్క్ వేసుకుంటే కరోనా రాదా? వేడి ప్రదేశాల్లో వైరస్ బతకదా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. రెండు నెలల్లో చైనాని సర్వ నాశనం చేసిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంపై

కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. రెండు నెలల్లో చైనాని సర్వ నాశనం చేసిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంపై పడింది. సుమారు 80 దేశాల్లో కరోనా వ్యాపించింది. 3వేల మందిని బలి తీసుకుంది. 80వేల మంది కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారు. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు.

కాగా, కరోనా వైరస్ గురించి రకరకాల అపోహలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఏది నిజం? ఏది అబద్దం? అనేది తెలియక జనాలు కన్ ఫ్యూజ్ అవుతున్నారు. తాజాగా కరోనా వైరస్ గురించి యూనిసెఫ్ మార్గదర్శకాలు విడుదల చేసింది అంటూ సోషల్ మీడియాలో ఓ నోట్ వైరల్ గా మారింది. దాన్ని జనాలు తెగ షేర్ చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లలో షేర్ చేస్తున్నారు. కరోనా వైరస్ రాకుండా ఏం చేయాలి? ఏమి తినకూడదు? ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? లాంటి సూచనలు కొన్ని ఉన్నాయి. దీంతో అంతా దాన్ని తెగ షేర్ చేసేస్తున్నారు. అందులో నిజానిజాలు ఏంతో తెలుసుకోకుండానే తెగ షేర్ చేస్తున్నారు.(కరోనా ఎఫెక్ట్ – హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో అత్యవసర సమావేశం)

దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ జరిగింది. ఇందులో నిజం వెలుగుచూసింది. యూనిసెఫ్ విడుదల చేసినట్టుగా చెబుతున్న ఆ మార్గదర్శకాలను అసలు యూనిసెఫ్ విడుదల చేయలేదట. యూనిసెఫ్ కి ఆ నోట్ కి ఎలాంటి సంబంధం లేదని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.

యూనిసెఫ్ పేరుతో కరోనా గురించి వైరల్ అవుతున్న నోట్ ఇదే..

* భయం కాదు అవగాహన పెంచుదాం.. కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నిజాలు..
* కరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే, ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరి చేరనివ్వదు. 
* ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు.
* కరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే, సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే, సరిపోతుంది.
* కరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, వైరస్‍ని అరికట్టినట్టే.
* ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది. 
* ఈ వైరస్ గనుక, 26-27 ° C లో ఉంటే, చనిపోతుంది. అందుకే వేడి గల ప్రదేశాల్లో బతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి. 
* కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.
* గోరు వెచ్చట నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు. 
* కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది. 

READ  భార్య..కొడుకు..పెంపుడు కుక్కని చంపేసి ఇంట్లోనే కుళ్లబెట్టాడు..తరువాత...

ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చు.

( UNICEF సౌజన్యంతో)

 ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహన పెంచుదాం… నలుగురికీ ఈ విషయాలు తెలిసేలా పంచుదాం..

ఇదీ… యూనిసెఫ్ పేరుతో వైరల్ అవుతున్న నోట్.. కానీ ఫ్యాక్ట్ చెక్ లో మాత్రం.. ఇది యూనిసెఫ్ విడుదల చేసినట్టు చెబుతున్న మాట వాస్తవం కాదని తేలింది. నెటిజన్లు గుడ్డిగా దీన్ని షేర్ చేస్తున్నారని తేలింది. ఇది జనాలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఫ్యాక్ట్ చెక్ లో నిర్ధారణ అయ్యింది.
 

ఫ్యాక్ట్ చెక్ లో తేలింది ఏంటంటే.. 
* కరోనా వైరస్ ఎక్కడెక్కడ సెటిల్ అవుతుందని కచ్చితంగా చెప్పలేము.
* మాస్క్ వేసుకుంటే కరోనా వైరస్ రాదనే గ్యారంటీ లేదు.
* దీనికి సంబంధించి ఏ స్టడీలోనూ నిర్ధారించలేదు. ఇన్ ఫెక్షన్ ఉన్న వ్యక్తి దగ్గరున్న వారు మాస్క్ వేసుకుంటే మంచిది అని మాత్రమే తేలింది.
* 26-27 ° C లో ఉంటే, వైరస్ చనిపోతుందని చెప్పడానికి ఆధారాలు లేవు. దీనికి నిదర్శనం.. పలు వేడి దేశాల్లోనూ కరోనా వైరస్ వ్యాపించడమే.
* వేడి నీళ్లు తాగడం, చల్లని పదార్ధాలకు దూరంగా ఉండటం వల్ల కరోనా రాదని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు.

సో.. యూనిసెఫ్ నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఇలా చేస్తే కరోనా రాదని యూనిసెఫ్ చెప్పింది అంటూ జనాలు షేర్ చేస్తున్న నోట్ అవాస్తవం. దీన్ని షేర్ చెయ్యడం నేరం కాదు, కానీ.. అదే వాస్తవం అని గుడ్డిగా నమ్మడం మాత్రం కరెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు.

corona

Related Posts