metro rail md nvs reddy comments on ts rtc strike

మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది : ఎన్వీఎస్ రెడ్డి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.  సాధారణ రోజుల్లో  మెట్రో రైలులో ప్రతిరోజు 3లక్షల మంది ప్రయాణిస్తుంటారని, ఆర్టీసీ  కార్మికుల సమ్మె కారణంగా అదనంగా మరో 50 వేలమంది  మెట్రో రైలును ఉపయోగిస్తున్నారని  అన్నారు.  

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు మరో 28 డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అక్టోబరు20 తేదీనాటికి 16వ రోజుకు చేరుకుంది. 

ఆదివారం ఉదయం ఎన్వీఎస్ రెడ్డి  మియాపూర్ మెట్రో స్టేషన్ ను పరిశీలించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరిగిందని అందుకనే ప్రజలు పెద్ద ఎత్తున మెట్రోను ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. 

Related Posts