లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

జంతువుల్ని వదిలేసి ‘మనిషుల్ని మనుషులే తినేసిన’ దారుణం..! మహిళల్ని, చిన్నారుల్ని కూడా వదల్లేదు..! వెంటాడి మరీ చంపి తినేశారు..!!

Published

on

Mexico :  People eaten, pigs left : మనిషి మేకల్ని, కోళ్లను, పందుల్ని, పలు రకాల పక్షుల్ని, జంతువుల్ని తింటుంటాడు. కానీ మనిషిని మనిషి తినటం అనేది చాలా చాలా భయానక విషయం. అలా మనుషుల్ని తినే మనుషుల్ని కాని బాల్స్ (నర మాంస భక్షకులు) అంటారు. కానీ జంతువుల్ని పక్షుల్ని తినే మనిషి జంతువుల్ని వదిలేసి సాటి మనిషినే తిన్న ఘటన గురించి వింటే వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది. ఒళ్లంతా జలదింపు వచ్చేస్తుంది. గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరిగిపోతుంది. ‘మనిషిని మనిషే తిన్న’ ఓ భయానక విషాయన్ని మెక్సికో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంథ్రపాలజీ అండ్‌ హిస్టరీ ప్రచురించిన నివేదిక వెల్లడించింది.

ఓ స్పానిష్‌ విజేత..1500 ప్రాంతంలో తన సైన్యంతో కలిసి.. బంధించిన సమూహానికి చెందిన పలువురు మహిళలు, పిల్లల్ని దారుణంగా చంపి.. తినేశాడని ఈ నివేదిక వెల్లడించింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..వారికి అందుబాటులో ఉన్న పందుల్ని వదిలేసి మనుషుల్ని తినేశారట. టెకోయాక్ సిటీలో జరిపిన తవ్వకాల్లో ఈ అత్యంత భయంకరమైన సంఘటన గురించి వెలుగులోకి వచ్చింది. ‘మనుషలు సాటి మనుషుల్ని తిన్న స్థలం ఇదే’ అని అజ్టెక్ నాహుఔట్ భాషలో ఉందని నివేదిక తెలిపింది.

1520 లో టెకోయిక్‌ నివాసితులు స్వదేశీ సమూహాల నుంచి సుమారు 350 మంది ప్రజలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను ‘జుల్టెపెక్’ అంటారు. ఇలా బంధించిన వారిలో 15 మంది పురుషులు, 50 మంది మహిళలు, 10 మంది పిల్లలు, 45 మంది సైనికులు ఉన్నారని తేలింది. వీరంతా ఆఫ్రికన్, స్వదేశీ సంతతికి చెందిన క్యూబన్లు అని నివేదిక వెల్లడించింది. ఇక వీరిని బంధించిన విషయం గురించి విజేత హెర్నాన్ కోర్టెస్‌కు సమాచారం ఇవ్వగా.. అతడు వారిని చంపి.. పట్టణాన్ని నాశనం చేయాలని ఆదేశించాడు. దాంతో అతడి సైన్యం నెలల వ్యవధిలో వీరందరిని చంపి.. 1521 ప్రారంభంలో పట్టణాన్ని నాశనం చేసినట్లు ఈ నివేదిక వెల్లడించింది.

దీనిపై ఇక్కడ తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎన్రిక్ మార్టినెజ్ వర్గాస్ మాట్లాడుతూ.. ‘‘ప్రతీకార చర్యలో భాగంగా ఈ దాడి జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ త్యాగం చేసిన వారి ఎముకలను, ఇతర సాక్ష్యాలను నిస్సార బావుల్లోకి విసిరినట్లు త్రవ్వకాలు బైటపడ్డాయి. ఇక్కడ ప్రజలు ఈ భయానక దాడిని ఆపడానికి ప్రయత్నించారు.. కానీ అది సాధ్యంకాలేదని తెలుస్తోంని తెలిపారు.

“పట్టణంలో బస చేసిన కొంతమంది యోధులు వీరి నుంచి తప్పించుకుని పారిపోగలిగారు. కాని మహిళలు, పిల్లలు వారికి చిక్కిపోయి బలైపోయారు. ఈ తవ్వకాల్లో చిన్నారుల ఎముకలు యుక్త వయసు యువతుల ఎములకు కూడా అక్కడ పడి ఉన్నాయని గుర్తించారు. వారిని ఖననం చేసిన స్థలాన్ని పరిశీలిస్తే..ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోతున్నవారిని వెంటాడి పట్టుకుని ఊచకోత కోసిసి వారిని ఖననం చేశారని తెలుస్తుందని ఆయన అన్నారు.

అక్కడితో వీరి దారుణ మారణకాండ ఆగలేదు. ఎన్నో దేవాలయాలు కాల్చేశారు. విగ్రహాలు తలలు నరికేశారు. పట్టుబడిన మహిళల తలలు నరికేసి.., పుర్రె రాక్‌లో వేలాడదీశారు. ఇలా భయంకరంగా బలైపోయిన ఓ మహిళ గర్భవతి అని తెలిసింది.

అలా కొంతమంది ప్రజల్ని బంధించి వారిని ఖైదీలుగా ఉంచి.. ఆరు నెలలకు పైగా ఆహారం ఇచ్చారు. ఆ తర్వాత గుర్రాల్ని, పురుషుల్ని, మహిళల్ని చంపి.. తినేసారని తేలింది. అయితే స్పానిష్‌ ప్రజలు తమతో పాటు ఆహారం కోసం పందులను తీసుకువచ్చారు. కానీ వాటిని తినలేదని తవ్వకాల ద్వారా తెలిసిందని తెలిపారు. అంటే జంతువుల్ని వదిలేసి సాటి మనుషులనే తిన్న నరరూప రాక్షుసులు వీరు.