లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘తలైవి’ కొత్త పోస్టర్ అదిరిందిగా!

Published

on

MGR Birth Anniversary: సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు.

MGR

ఆదివారం (జనవరి 17) ఎంజీఆర్ 104 వ జయంతి సందర్భంగా ‘తలైవి’ నుండి గ్లింప్స్ రిలీజ్ చేశారు. సాంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టు, ఎంజీఆర్ మాదిరి టోపితో అరవింద్ స్వామి అచ్చుగుద్దినట్లు దిగిపోయారు. ప్రజలకు అభివాదం చేస్తూ, స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న అరవింద్ స్వామి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక జయలలిత, అరవింద్ స్వామి కలిసి ఉన్న పోస్టర్ అయితే చాలా బాగుంది.

Thalaivi

‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్, కెమెరా : విశాల్ విఠల్, నిర్మాణం : విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్.