mha announce corona virus disaster

కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, జాతీయ విపత్తుగా గుర్తింపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా(notified disaster) గుర్తించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్‌తో

ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా(notified disaster) గుర్తించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. కరోనా వైరస్‌ వల్ల మరణించిన వారి కుటుంబాలకు విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా సహాయమందిస్తారు. కరోనా వైరస్‌తో చికిత్స పొందుతున్న వారికి ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. అటు పద్మ అవార్డులపై కరోనా ప్రభావం పడింది. ఏప్రిల్‌ 3న రాష్ట్రపతి భవన్‌లో జరగాల్సిన అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడింది.

విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు మూసివేత:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం చూపిస్తోంది. మన దేశంలోనూ కరోనా విస్తరిస్తోంది. ఇప్పటివరకు మన దేశంలో 85 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు చనిపోయారు. కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తుండడంతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాయి. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, సినిమా థియేటర్లు మార్చి 31వ తేదీ వరకు మూసి వేయాలని ఆదేశాలు ఇచ్చాయి. కరోనా విస్తరించకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి.

జలుబు చేసినా, దగ్గొచ్చినా గుండె దడ పెరిగిపోతోంది:
జలుబు చేసినా, దగ్గొచ్చినా గుండె దడ పెరిగిపోతోంది. ఛాతి, తలలో నొప్పి వస్తే.. గుండె ఆగినంత పనైపోతుంది. కరోనా వ్యాప్తితో ప్రతి ఒక్కరిలోనూ ఇదే టెన్షన్‌. వైరస్‌ ఎఫెక్ట్‌తో ఇండియాలో ఆందోళనకరమైన సిట్యువేషన్ కనిపిస్తోంది. రెండు కరోనా మరణాలు నమోదు కావడం.. బాధితుల సంఖ్య 85కు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వైరస్‌కు ముకుతాడు వేసే దారిలేక.. జాగ్రత్త చర్యలతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.  

కరోనా లక్షణాల్లో మొదటిది జ్వరం:
కరోనా లక్షణాల్లో మొదటిది జ్వరం.. ఆ తర్వాత పొడిదగ్గు, ముక్కు కారడం. వారం రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి. పదిరోజుల తర్వాత ఫీవర్ టెంపరేచర్ పెరిగిపోతుంది. ఈలోగా ఊపిరిసలపని జలుబు, దగ్గు ఎక్కువైపోతుంది. అదే టైమ్‌లో తలనొప్పి, ఛాతి నొప్పి తీవ్రంగా వేధిస్తుంది. చూస్తుండగానే న్యూమోనియాకు దారితీస్తుంది. ఉపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. అది గుర్తించేలోపే మిగతా అవయవాలకు వైరస్‌ పాకుతుంది. కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఊపిరాడని పరిస్థితి నెలకొంటుంది. అసలు దగ్గడానికి, తుమ్మడానికి శక్తి లేకుండా పోతుంది. అప్పటికే వ్యాధి లక్షణాలు చికిత్సకు లొంగకుండా తయారవుతాయి. దీంతో ఉన్నట్టుండి ఊపిరి ఆగిపోతుంది. 

READ  RRR మూవీలో.. తారక్ కి జోడిగా హాలీవుడ్‌ భామ

కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే:
చైనాలో వైరస్‌ బారినపడ్డ బాధితుల్ని ఎక్స్‌రే తీయగా ఉపిరితిత్తుల్లో నీరు చేరినట్టుగా క్లియర్‌గా తెలుస్తోంది. వైరస్‌ ఎఫెక్ట్‌ ఒక్క లంగ్స్‌కే కాదు రోజుల వ్యవధిలోనే కిడ్నీలతో పాటు ఇతర భాగాలకు చేరుతుంది. అవి పనిచేయకుండా నిర్వీర్యం అయిపోతాయి. కీలక అవయవాలు పనిచేయకుండా పోవడంతో ఏ క్షణమైనా ప్రాణాలు పోయే అవకాశాలుంటాయి. ఈ లక్షణాలకు చికిత్స చేయడం తప్ప ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. అలాగే పార్కిన్సన్‌, డయాబెటిస్‌ లాంటి పేషెంట్లు కూడా కరోనా బారినపడుతున్నారు. 

See Also | కరోనా షట్ డౌన్ : తెలంగాణాతో సహా..పలు రాష్ట్రాల్లో మార్చి 31 వరకు సమస్తం బంద్

Related Posts