లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

రెండో భార్యకు విడాకులిచ్చిన మిచెల్ క్లార్క్

Published

on

Michael Clarke And Wife Confirm Divorce After Seven-Year Marriage

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మిచెల్ క్లార్క్, అతడి భార్య కైలై తమ ఏడేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించారు. మార్చి 2012లో వీరిద్దరికి పెళ్లి అయింది. వీరికి నాలుగేళ్ల కూతురు కెల్సే లీ కూడా ఉంది. కొంత కాలం పాటు అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్య జీవితంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయి.

దాంతో మిచెల్ దంపతులు వీడి పోవాలని నిర్ణయించుకున్నారు. మా వివాహ బంధం కష్టంగా మారింది. విడాకులు తీసుకుంటున్నమని ఇద్దరూ కలిసి ప్రకటించారు. ‘ఒకరినొకరం ఎంతో గొప్పగా గౌరవించుకున్నాం. ఏకాభిప్రాయంతో విడిపోవాలని నిర్ణయానికి వచ్చాం.

మేం విడిపోయినా మా కుమార్తె విషయంలో ఇద్దరం కలిసే చూసుకుంటాం’ అని చెప్పుకొచ్చారు. మిచెల్ క్లార్క్, భార్య కైలై మధ్య విడాకుల విలువ 40మిలియన్ల డాలర్లుగా ఓ రిపోర్టు నివేదించింది. ఐదు నెలల క్రితమే ఈ దంపతులిద్దరూ విడిపోయినట్టు ఫాక్స్ స్పోర్ట్స్ తెలిపింది. 8 మిలియన్ డాలర్ల విలువైన తన వాక్లూజ్ ప్రాపర్టీ నుంచి మిచెల్ బయటకు వెళ్లిపోనున్నాడు.

ఆ ప్రాపర్టీతో 38ఏళ్ల కైలై క్లార్క్తో పాటు ఆమె కుమార్తె ఇద్దరు అక్కడే ఉండనున్నట్టు రిపోర్టు పేర్కొంది. 2015లో వరల్డ్ కప్ క్యాంపెయిన్ లో ఆస్ట్రేలియా సారథిగా మిచెల్ క్లార్క్ విజయవంతమయ్యాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్ లో మొత్తం 115 టెస్టులు ఆడిన మిచెల్.. 8,643 పరుగులు సాధించాడు. అందులో 28 సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాదు.. 245 వన్డేలు, 34 టీ20లు కూడా మిచెల్ క్లార్క్ ఆడాడు. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *