Michigan man  Mark Clark wins second $4 million instant lottery prize in the last 3 years

నాన్నఇచ్చిన నాణెంతో..లక్ లక్కలా అతుక్కుంది : రూ.60కోట్ల లాటరీలు గెలిచిన అదృష్టవంతుడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లక్ లక్కలా అతుక్కుంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది. అటువంటి అదృష్టవంతుడికి రెండు సార్లు కోట్ల రూపాయల లాటరీ తగిలింది. దీంతో అతను ఏకంగా లాటరీ కింగ్ అయిపోయాడు అమెరికాలోని మిచిగాన్ లో నివసిస్తున్న మార్క్ క్లార్క్.

టన్నుల కొద్దీ అదృష్టం ఉన్న మార్క్ క్లార్క్ కు 2017లో 4 మిలియన్ల(భారత కరెన్సీలో దాదాపు 30 కోట్లు) లాటరీ గెలుచుకున్నాడు. తాజాగా మరో 30 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. దీంతో ఉబ్బి తబ్బిబైపోతున్నాడు. ఇందంతా మా నాన్నవల్లేనంటున్నాడు.

మిచిగాన్ లో నివసించే మార్క్ క్లార్క్ ఇటీవల ఓ లాటరీ టికెట్ ను ప‌దేళ్ల క్రితం చ‌నిపోయిన‌ తండ్రి కానుక‌గా ఇచ్చిన నాణెంతో గీకి రూ.30 కోట్లు గెలుచుకున్నాడు. ఈ విష‌యాన్ని స్థానికి అధికారులు కూడా సోమ‌వారం (జూన్ 22,2020)న ధృవీక‌రించారు. 

దీనిపై సంతోషంగా ఉన్న క్లార్క్ మాట్లాడుతూ..’నా సంతోషాన్ని మాట‌ల్లో చెప్ప‌లేక‌పోతున్నాను..మూడు సంవత్సరాల క్రితం భారీ మొత్తంలో లాటరీ గెలుచుకున్న నేను మ‌ళ్లీ లాట‌రీ గెలిచానంటే నమ్మలేకపోతున్నారు. దీనికి కారణం మా నాన్న నాకు ఇచ్చిన నాణెం కార‌ణ‌మ‌ని అనుకుంటున్నా..నాపాలిట అదృష్టం మానాన్న నాకిచ్చిన నాణెం.ఇప్పుడు నా జీవితం ద‌శ తిరిగిపోయిందని సంతోషంతో చెప్పాడు క్లార్క్.

Read: ప్రజలు ఆకలి కేకలు పెడుతుంటే..తన 15మంది భార్యలకు Rs.175 కోట్ల లగ్జరీ కార్లు కొన్న రాజు

Related Posts