చైనా కంపెనీలకు మైక్రోమాక్స్ సవాల్.. స్వదేశీ ఫోన్‌ మార్కెట్లోకి.. నవంబర్ 3న విడుదల

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ మళ్లీ తిరిగి వస్తోంది. ఇటీవల, సంస్థ CEO ఒక కొత్త ఎమోషనల్ వీడియో ద్వారా ఈ విషయం గురించి వెల్లడించారు. భారతీయ మార్కెట్లోకి తిరిగి వస్తున్నానని మైక్రోమాక్స్ సీఈఓ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మైక్రోమాక్స్ తన కొత్త ఇన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌కు తేదీని ప్రకటించింది. కొత్త మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 3 న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కాబోతుంది.నవంబర్ 3వ తేదీన, వర్చువల్ ఈవెంట్‌ ద్వారా కంపెనీ ఇన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రారంభించనుంది. కంపెనీ బడ్జెట్, మిడ్ రేంజ్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. మొబైల్ ఇండియన్ బ్లాగ్ నివేదిక ప్రకారం, మైక్రోమాక్స్ IN సిరీస్ రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుంది. వీటికి మీడియాటెక్ హెలియో జి 35, హెలియో జి 85 ప్రాసెసర్లు ఇవ్వబడతాయి.IN సిరీస్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల HD ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క రెండు మెమరీ వేరియంట్‌లను 3 జీబీ మరియు 32 మరియు 4 జీబీ, 64 జీబీ లాంచ్ చేయవచ్చు. చైనా కంపెనీలను టార్గెట్ చేస్తూ మైక్రోమాక్స్ ముందుకు వస్తున్నట్లు పరోక్షంగా చైనా కంపెనీలకు సవాల్ విసిరింది మైక్రోమాక్స్. అయితే చైనా కంపెనీలతో ఎలా పోటీ పడుతుందో ఇప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా కంపెనీల ఆధిపత్యం ఇప్పటికీ సాగుతుంది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఆత్మనిర్భర్ భారత్’ పిలుపు మేరకు పరిమిత బడ్జెట్‌లో పూర్తిగా ఇండియాలో తయారైన స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ‘మైక్రోమాక్స్’.. రూ.7వేల నుంచి రూ.25వేల వరకు స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకుని రానుంది. Helio G35 ప్రాసెసర్, 3GB RAM, 32GB స్టోరేజ్, 6.5-inch HD+ display, 5000mah బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉంటాయని చెబుతున్నారు. భారత్-చైనా ఉద్రిక్తతల ముందే ‘In సిరీస్ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ తాయారు చేయడం ప్రారంభించగా.. ఈ స్మార్ట్‌ఫోన్ మోడళ్లన్నీ కూడా ఇండియాలోనే తయారవుతున్నాయి.

Related Tags :

Related Posts :