లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

హైదరాబాదులో పాల ఏటీఎం

Published

on

Milk ATM : డబ్బులు తీసుకునే ATMలు చూశాం..వాటర్ ATMలు కూడా చూశాం. కానీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ మహానగరంలో మొట్టమొదటిసారిగా Milk ATM అందుబాటులోకొచ్చింది. నంగరంలోని ఎల్బీనగర్ పరధిలోని ప్రజలకు ఈ Milkh ATM అందుబాటులోకి వచ్చింది.


ఈ సదుపాయంతో ఆ ప్రాంత ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలను తీసుకెళ్లే అవకాశం లభించింది. ఉచితంగా కాదండీ బాబూ డబ్బులకే. హస్తినాపురం డివిజన్, హనుమాన్‌నగర్ చౌరస్తాలో ఈ పాల సరఫరా ఏటీఎంను ఏర్పాటు చేశారు. పాల కోసం ఏటీఎంకు వెళ్లేవారు పాత్రను కానీ, సీసాలను కానీ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. లీటర్, అర లీటర్, పావు లీటర్ మీట్లను అందులో అమర్చారు.


వినియోగదారులు తమ అవసరానికి తగ్గట్టుగా పాలను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, డబ్బులను మాత్రం అక్కడే ఉండే సిబ్బందికి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి పాల ఏటీఎం ను శ్రీ గీతా డెయిరీ చైర్మన్ లక్ష్మీనరసింహగుప్తా ఏర్పాటు చేశారు.



స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి శుక్రవారం (అక్టోబర్ 23,2020)న ప్రారంభించారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఏటీఎం అందుబాటులో ఉంటుందని గుప్తా తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *