లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

జేసీ అక్రమాలు…త్రిశూల్‌ కంపెనీకి మైనింగ్‌ శాఖ నోటీసులు

Published

on

Trishul company irregularities : జేసీ దివాకర్‌ రెడ్డి.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు.. తన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే జేసీ.. తన సిమెంట్‌ కంపెనీ త్రిశూల్‌తో మరోసారి వార్తల్లోకెక్కారు.. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి జేసీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి రావడం ప్రారంభమైందని చెప్పాలి.. జేసి ట్రావెల్స్ పేరుతో ఫోర్జరీ సంతకాలతో NOCలు సృష్టించి తుప్పు పట్టిన లారీలను బస్సులుగా మార్చి అమ్మి సొమ్ము చేసుకున్న కేసు తర్వాత త్రిశూల్ సిమెంట్ కంపెనీ పేరుతో మైనింగ్ అక్రమాలకు పాల్పడిన కేసు బయటికి వచ్చింది..రాష్ట్ర మైనింగ్‌ శాఖ అధికారులు జేసీ కుటుంబానికి మరో షాక్ ఇచ్చారు.. మైనింగ్‌ అక్రమాలకు సంబంధించి వందకోట్ల రూపాయల జరిమాన చెల్లించాలంటూ నోటీసులు పంపారు.. హైకోర్టు ఆదేశాలతో త్రిశూల్ సిమెంట్ కంపెనీ అక్రమ తవ్వకాలపై మైనింగ్‌ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.. ఈ విచారణలో మైనింగ్ శాఖ అధికారులు విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు… లక్షా 21 వేల 956 మెట్రిక్ టన్నులకు మైనింగ్‌ పర్మిషన్ తీసుకొన్న త్రిశూల్ సింమెంట్ కంపెనీ… దాదాపు 14 లక్షల మెట్రిక్ టన్నుల విలువైన వైట్ స్టోన్ తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు..అక్రమ మైనింగ్‌పై ఈ ఏడాది మే 7న త్రిశూల్‌ కంపెనీ యజమానులకు మైనింగ్‌ శాఖ అధికారులు నోటీసులు పంపారు15 రోజులలో వివరణ ఇవ్వాలని కోరారు.. అయితే ఈ నోటీసులపై త్రిశూల్‌ కంపెనీ యాజమాన్యం స్పందించలేదు.. దీంతో ఆగస్టు 20న 100 కోట్ల 24 లక్షల 44 వేల రూపాయలు జరిమాన విధిస్తూ నోటీసులు జారీ చేసింది.జరిమాన విధించిన సొమ్మను వెంటనే చెల్లించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. ఒక వేళ జరిమాన చెల్లించకపోతే పోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తులు జప్తు చేస్తామని కూడా నోటీసుల్లో హెచ్చరించింది. అదే సమయంలో త్రిశూల్ కంపెనీ షేర్ హోల్డర్లైన 8 మందికి సంబంధించిన ఆస్తులను గుర్తించాలని ఐదు మండలాల తహసీల్దార్‌లను ఆదేశించింది.మైనింగ్‌ శాఖ ఆదేశాలతో యాడికి, పెద్దపప్పూరు, తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు మండలాల తహశీల్దార్లు.. విచారణ జరిపారు. త్రిశూల్ సిమెంట్ కంపెనీ షేర్ హోల్డర్లకు తమ ప్రాంతాల్లో ఆస్తులు లేవని రిపోర్ట్ ఇచ్చారు. దీంతో మైనింగ్ శాఖ త్రిశూల్ కంపెనీ షేర్ హోల్డర్ల ఆస్తులకు సంబంధించిన సర్వే నెంబర్లు ఇచ్చి ఇవి వారివా? కాదా? గుర్తించాలని.. కోరింది. ఒక వేళ ఆ ఆస్తులు వారివని తేలితే అటాచ్ చేయాలని మైనింగ్ శాఖ తాహసిల్దార్లకు ఆదేశాలు జారి చేసింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *